Political ysrcp mla srikanth reddy fire on chandrababu naidu

ysrcp mla srikanth reddy, chandrababu naidu, ysrcp, jagan-ysr, tdp, congrss party, chandrababu, cm kiran kumar reddy, srikanth fire on babu, 2014 eleciton,

ysrcp mla srikanth reddy fire on chandrababu naidu

బాబుపై దుమ్మెత్తిపోసిన ఎమ్మెల్యే

Posted: 05/18/2013 06:06 PM IST
Political ysrcp mla srikanth reddy fire on chandrababu naidu

కాంగ్రెసు అధిష్టానం దర్శకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కథ నడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఇదంతా తాము ఆధారాలతోనే చెబుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు స్పష్టంగా బయటపడిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఆ రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో అభివృద్ధికి వైయస్ రాజశేఖర రెడ్డి మారుపేరు అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు, ఫిక్సింగ్‌లకరు మారుపేరు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చంద్రబాబు ఇప్పటికిప్పుడు మాట్లాడడం వెనక ఆంతర్యమేమిటని ఆయన సమావేశంలో అడిగారు.

ఆరోపణలను ఎదుర్కుంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలనే ఆకస్మిక డిమాండ్ చంద్రబాబు నుంచి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము కాంగ్రెసులో కలుస్తామని చంద్రబాబు నేరుగా అంగీకరించవచ్చు కదా అని ఆయన అన్నారు. ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం, కాంగ్రెసు కుమ్మక్కు కావడం వాస్తవం కాదా అని ఆయన అడిగారు. లోక కళ్యాణం కోసం పాటుపడే వ్యక్తా చంద్రబాబు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles