Political minister tg venkatesh comment on kcr family

minister tg venkatesh, tg venkatesh comment on kcr family, comedy show, telanaga issue, trs mla harish rao, ktr, kavitha, kcr, tdp, ysrcp, bjp,

minister tg venkatesh comment on kcr family

కేసిఆర్ ఫ్యామిలీ కామెడీ 'షో'

Posted: 05/16/2013 09:53 AM IST
Political minister tg venkatesh comment on kcr family

హరీష్‌రావు వల్లే టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందని, ఆయన కారణం గానే సమైక్యాంధ్రవాదం బలపడిందన్నారు. తెలంగాణాకు అనుకూలం అంటూ తెలుగుదేశం, బీజేపీతో పాటు కమ్యూనిస్టులు ప్రకటిస్తున్నా వారితో టీఆర్‌ఎస్‌ ఎందుకు కలవడం లేదని మంత్రి టీజీ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసినట్లే కలిసి దూరం అయ్యారని, కేసిఆర్‌కు కోదండరామ్‌తో కూడా సఖ్యత లేదన్నారు. అన్ని పార్టీలు తెలంగాణాకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో టీఆర్‌ఎస్‌కే జనం ఎందుకు ఓట్లేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కేసీఆర్‌ కుటుంబానికి ఇష్టంలేదని అందువల్ల జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ అందరినీ దూరం చేసుకుంటున్నారని ఆరోపించారు. అదిగో తెలంగాణా.. ఇదిగో తెలంగాణా.. ఇచ్చేది మేమే .. తెచ్చేది మేమే అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు కామెడీ షో నిర్వహిస్తున్నారని, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్‌ ఎద్దేవా చేశారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌, కూతురు కవిత, అల్లుడు హరీష్‌రావు ఈ షోలో పాత్రదారులన్నారు. తెలంగాణా అంశం తెరమరుగైందని, ఉనికిని కాపాడుకునేందుకు ఒక రోజు ఆందోళనలు, మరో రోజు నిరసనలు వ్యక్తం చేసి, నెల రోజులు సెలవులు తీసుకుంటూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నారని టిజి ఆరోపించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles