Sanjay dutt to surrender before court by 4pm today

sanjay dutt, sanjay dutt to surrende, 1993 bombay blasts case, mumbai tada special court, bollywood actor sanjay dutt,

sanjay dutt to surrender before court by 4pm today

లొంగిపోనున్న సంజయ్‌దత్

Posted: 05/16/2013 11:19 AM IST
Sanjay dutt to surrender before court by 4pm today

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ టాడా కోర్టు ఎదుట లొంగిపోనున్నారు. పుణె ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సంజయ్‌దత్ ఉపసంహరించుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సంజయ్‌దత్ ముంబైలోని టాడా కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయి. ఈ కేసులో సంజయ్‌దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడాదిన్నర కాలం జైలు జీవితం గడిపిన సంజయ్‌దత్ మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. సంజయ్ కోర్టులో లొంగిపోవడానికి సుపీంకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ గడువు 16వ తేదీతో ముగియనుంది. సినిమా షూటింగ్‌ల కారణంగా లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలన్న సినీ నిర్మాతల విజ్ఞప్తిని సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ముంబైలో స్వార్థ శక్తులు, మతఛాందసవాద గ్రూపుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల పుణెలోని ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని స్పెషల్ టాడా కోర్టులో సంజయ్‌దత్ పిటిషన్ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles