Political congress workers had a fight among two groups in korutla

congress workers clash in korutla, karimnagar district korutla, ex mla komireddy ramulu, ex minister j ratnakara rao

political-congress workers had a fight among two groups in korutla

కోరుట్లలో సిగపట్లు

Posted: 04/30/2013 01:09 PM IST
Political congress workers had a fight among two groups in korutla

కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజక వర్గ సమావేశంలో కరీం నగర్ జిల్లా కోరుట్ల లో మాజీ శాసనసభ్యుడు కోమిరెడ్డి రాములు, మాజీ మంత్రి జె.రత్నాకర రావు మద్దతుదారుల మధ్య సిగపట్లు సంభవించాయి.  వేదిక మీదకు పెద్దలను ఆహ్వానిస్తున్న తరుణంలో విస్మరించిన రాములు విషయంలో రాములు మద్దతుదారులు, సింగల్ విండో ఛైర్మన్ లక్ష్మారెడ్డి మద్దతుదారులు అభ్యంతరాలు తెలియజేసారు.  అంతే కాకుండా ఫ్లెక్సీలలో రాములు ఫోటో కూడా లేకపోవటం వారికి ఆగ్రహాన్ని కలిగించింది. 
ఈ సందర్భంలో రత్నాకరరావు మద్దతుదారులు రాములు మద్దతుదారుల మీద కుర్చీలను ఎత్తి వేసి దాడి చేసారు.  దానితో ఇరు వర్గాలు కాలర్లు పట్టుకుని ముష్టిఘాతాల ప్రహారం చేసుకున్నారు. 
విశేషమేమిటంటే రాములు ఆ సమయంలో అక్కడ లేనుకూడా లేరు.  ఆయన హైద్రాబాద్ పని మీద వచ్చున్నారు.
డిసిసి ప్రెసిడెంట్ కె.రవీంద్రరావు మాత్రం ఆ ఘటనను తేలిగ్గా తీసుకుంటూ, చిన్న విషయమేనని, వెంటనే సర్దుకుందని, తర్వాత నాలుగు గంటలసేపు సభ జరిగిందని అన్నారు. 
-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles