Dharmana relieved by hc order

dharmana petition upheld by hc, high court of andhra pradesh, dharmana prasada rao, roads and transport minister, ys jaganmohan reddy, nimmagadda prasadarao, mopidevi

dharmana relieved by hc order

ధర్మానకు ఊరట

Posted: 04/30/2013 10:47 AM IST
Dharmana relieved by hc order

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావుకి నిన్న హైకోర్టులో తీర్పుతో ఊరట లభించింది.  

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా పరిగణిస్తూ నేరారోపణ చేసిన సిబిఐ, అప్పట్లో రెవిన్యూ శాఖకు మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మీద కేసు నమోదు చెయ్యటానికి అంగీకరించిన కింది కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు జస్టిస్ శేషశాయనరెడ్డి ప్రభుత్వ ఆమోదం అవసరమని నిన్న తీర్పునిచ్చారు.  

మంత్రి మీద కేసు నమోదు చేసి విచారణ సాగించటానికి ప్రభుత్వ ఆమోదం అవసరమని ముందు తెలిపిన ట్రయల్ కోర్టు, జనవరి 21 న అవనీతి కేసుల్లో మంత్రి మీద కేసు పెట్టటానికి ప్రభుత్వ ఆమోదం అవసరం లేదని సిబిఐ కి పచ్చ జెండా చూపించగా, దానిమీద మంత్రి ధర్మాన హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేసారు.  ట్రయల్ కోర్టు ముందు ఆదేశించినట్లుగా ప్రభుత్వ అనుమతిని కోరిన సిబిఐకి ప్రభుత్వం నుంచి ధర్మాన విషయంలో విచారణకు అనుమతి లభించలేదు.   పోయిన వారంలో ధర్మాన పిటిషన్ మీద తీర్పుని వెల్లడించటానికి నిన్నటి రోజుకి వాయిదా వేసిన హైకోర్టు నిన్న ధర్మాన పక్షంలో తీర్పు నివ్వటంతో ఆయనకు ఊరట కలిగింది.

ట్రయల్ కోర్టు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులకు మిగిలినవారందరికీ మే 11 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.  

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles