Cm kiran kumar in karnataka election campaign

kiran kumar in karnataka campaign, election campaign in karnataka, congress party of india, bharatiya janata party, chiranjeevi

cm kiran kumar in karnataka election campaign

ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం

Posted: 04/30/2013 09:55 AM IST
Cm kiran kumar in karnataka election campaign

కర్నాటకలో జరుగనున్న ఎన్నికలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారానికి పూనుకోవటం విశేషం.  ఆ కార్యక్రమం ఈ రోజు, రేపు జరుగనున్నాయి.  

పోయినసారి కర్నాటక, తమిళనాడు ఎన్నికలకు చిరంజీవి ప్రచార భారాన్ని మోయగా ఈ సారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బెంగళూరు శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు.  
కర్నాటకలో పాతిన భాజపా జెండాని ఊడదీయటానికి కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో విస్తృతంగా ప్రచారం కావించింది.  రాహుల్ గాంధీ కర్నాటకలో పర్యటించి, ఢిల్లీలో జరిగిన బాలికా అత్యాచారాన్ని ఉటంకిస్తూ, ఢిల్లీలోనే న్యాయం చెయ్యలేని భాజపాప కర్నాటకలో ఏం ఒరగబెడుతుందని ఎద్దేవా చేసారు.  భాజపా కూడా తమ వంతు ప్రచారం తామూ చేసుకుంటోంది. 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గా కాకుండా పార్టీ కార్యకర్తగా ప్రచార భారాన్ని మోస్తూ కిరణ్ కుమార్ పార్టీ పట్ల తన విశ్వాసపాత్రతను తెలియజేసుకుంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles