Political sonia gandhi fire on law minister ashwani kumar

sonia gandhi fire on law minister ashwani kumar, law minister ashwani kumar, congress president sonia gandh, coalgate scam, ashwani kumar, cbi report, pm, manmohan singh,

sonia gandhi fire on law minister ashwani kumar

అశ్విన్ కుమార్ పై సోనియా ఆగ్రహం..?

Posted: 04/26/2013 04:03 PM IST
Political sonia gandhi fire on law minister ashwani kumar

బొగ్గు కుంభకోణం లో సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క సిబిఐ కోర్టులో రిపోర్టు దాఖాలు చేసిన విషయం తెలిసిందే. కోల్ గేట్ కుంభకోణం యుపిఏ సర్కార్ మెడకు చుట్టుకున్నా ఈ విషయంలో న్యాయశాఖ మంత్రిని బలి పశువును చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయసభలు ఈ విషయంలో ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్న తరుణంలో జరిగిన యూపిఎ అత్యవసర సమావేశంలో కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ ప్రధానికి అండగా నిలిచాయి. ఈ సమావేశంలో మంత్రి అశ్విన్ కుమార్ పై సోనియా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో మంత్రి రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మన్మోహన్ సింగ్ ను మాత్రం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనుకేసుకొచ్చారు. సమావేశ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ అశ్విన్ కుమార్ కు అండగా నిలిచారు. ఆయన రాజీనామా చేయాల్సినవసరం లేదన్నారు. మరికొంతమంది నేతలు సైతం మంత్రి అశ్విన్ కుమార్ ను సమర్ధిస్తున్నారు. అయితే మంత్రి రాజీనామ విషయమై ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన వసరం లేదని, ఈ నెల 30వ తేదీ వరకు వేచి ఉండాలని యూపిఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles