Minister maganti babu son arrest

minister maganti babu son arrest, maganti ramji, maganti babu, obscene messages, tdp leader

minister maganti babu son arrest

మంత్రి కొడుకు అరెస్టుకు రంగం సిద్ధం.

Posted: 04/26/2013 01:45 PM IST
Minister maganti babu son arrest

దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులకు నిరసనలతో మహిళ లోకం మండిపడుతుంది. ఇలాంటి సమయంలో ఒక రాజకీయ నాయకుడు కొడుకు కూడా అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అతను సోషల్ వెబ్ సైట్ లను వేదికగా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సినీ నిర్మాత మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడన్న అభియోగంతో రాంజీని అరెస్టు చేయనున్నట్లు సమాచారం. బెంగుళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వివాహితకు అసభ్యకర ఈ మెయిల్స్ పంపినట్లు సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మాగంటి రాంజీపై కేసు నమోదైంది. సెక్షన్ 506,509 ఐటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మాగంటి బాబు ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. అసభ్యకర మెసేజ్ లతో రాంజీ తనను వేధిస్తున్నాడని ఓ అమ్మాయి చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలని గతంలో పలు మార్లు రాంజీకి సమాచారం ఇచ్చారు. అయినా.. ఆయన తేలిగ్గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles