Political mla balineni srinivasa reddy comment on cm kiran

mla balineni srinivasa reddy comment on cm kiran,jagan mla balineni srinivas reddy,cm kiran, ysr-ys jagan, congress party, balineni srinivasa reddy, gadikota srikanth reddy,

mla balineni srinivasa reddy comment on cm kiran

గిన్నీస్‌ బుక్‌లోకి కిరణ్‌ సర్కార్‌

Posted: 04/26/2013 11:18 AM IST
Political mla balineni srinivasa reddy comment on cm kiran

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనీవిననిరీతిలో ప్రజలపై పన్నులు, ఛార్జీల భారాన్ని మోపడంలో ముందున్న కిరణ్‌ సర్కార్‌ను ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌‌స’లోకి ఎక్కించాలని వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం తరపున సదరు సంస్ధకు విజ్ఞప్తిచేసింది. ప్రజలపై రూ.50 వేల కోట్ల భారంమోపి పేద ప్రజానీకాన్ని జలగల్లాగా పీడించడం తప్ప మరొకటి లేదని ఆ పార్టీ నేతలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వతీరు చూస్తుంటే చివరకు పీల్చేగాలికి కూడా ఛార్జీలు వసూలుచేసి ఖజానా నింపుకోవాలని చూస్తున్నట్లుగా కనపడుతోందని వారు ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గత 3 సంవత్సరాల్లో విద్యుత్‌ ఛార్జీలు, బస్సుఛార్జీలు, ఆస్ధిపన్ను, వ్యాట్‌, నల్లా బిల్లుల పెంపు ద్వారా రూ.50వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం తప్ప కిరణ్‌ సాధించింది ఏమీ లేదని వారు ఏద్దేవాచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles