Blast at idl company in kukatpally

blast at idl company in kukatpally, two explosions at gulf oil premises kill, gulf oil detonator factory in kukatpally, idl factory, two staffers killed, cm kiran kumar reddy

blast at IDL company in kukatpally

ఉలిక్కిపడ్డ కూకల్ పల్లి ?

Posted: 04/26/2013 11:02 AM IST
Blast at idl company in kukatpally

కూకట్‌పల్లిలోని 'గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఒకప్పటి ఐడీఎల్) డిటొనేటర్ సెక్షన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కంపెనీ డీఎఫ్-1 సెక్షన్‌లో రాత్రి 7.30 గంటలకు డిటొనేటర్ ఫ్యూజ్ వైర్లను తయారుచేసే ప్లాంటులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎల్బీనగర్ కొత్తపేటకు చెందిన అర్జున్‌శేఖర్ (64), ప్రసాద్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. మూసాపేటకు చెందిన వీరస్వామి అనే కార్మికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పేలుడు జరిగిన చోటుకు సమీపంలో ఉన్న ఫీజు కటింగ్, కోటింగ్ సెక్షన్‌లోని 26మంది కార్మికు లలో కొందరు భోజనం కోసం బయటకు రావడంతో భారీ ప్రాణనష్టం తప్పిందంటు న్నారు. అయితే కంపెనీలో ఎటువంటి పేలుళ్లు జరగలేదని, డిటొనేటర్ల తయారీలో ప్రమాదంవల్ల కార్మికులు మృతి చెందారని కంపెనీ ప్రతినిధి సుభాష్ ప్రమాణిక్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. కాగా.. ఐడీఎల్ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు రంగారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా.. సరైన భద్రత తీసుకోకనే ఈ ఘటన జరిగింద ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన అధికారులను, కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వారికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles