Co victim in delhi gang rape demands job and compensation

delhi gang rape male victim, victim in gang rape demands, december 16 gang rape, home minister susheel kumar shinde

co victim in delhi gang rape demands job and compensation

సహ బాధితుడు, ప్రత్యక్షసాక్షి కోరికలు

Posted: 04/23/2013 11:26 AM IST
Co victim in delhi gang rape demands job and compensation

ఢిల్లీ లో బస్ లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలితో పాటు మరో బాధితుడున్నాడు.  ఆ సమయంలో ఆమెతోపాటు ప్రయాణం చేస్తున్న ఆమె స్నేహితుడు.  బాధితురాలి అసభ్య ప్రవర్తనను వారించిన అతను ముందుగా వాళ్ళ హింసలకు గురయ్యాడు.  జరిగిన సంఘటనకు ప్రత్యక్షసాక్షి అతనే.  అతను చెప్పిన విషయాల ఆధారంగానే ఆ బస్సుని అత్యాచారం చేసినవారిని పోలీసులు పట్టుకోగలిగారు. 

బాధితుడు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి రాసిన లేఖలో తనకి ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారాలను కూడా ఇప్పించమని కోరుతూ తన విద్యార్హతలను అందులో పొందుపరచాడు.  ఏకైక ప్రత్యక్ష సాక్షైన తనకు కోర్టులో విచారణకు హాజరయినప్పుడు భద్రతా ఏర్పాట్లను చెయ్యాలని కూడా అతను కోరాడు. 

ఇప్పటికే 20 లక్షల వరకు హాస్పిటల్ లోనే ఖర్చయిందని, పడ్డ మానసిక వేదన అదనమని చెప్తూ, వీటన్నికి తోడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరవటానికి కూడా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టుగా అతను తెలియజేసాడు. 

డిసెంబర్ 16న జరిగిన సంఘటనలో బాధితురాలు 13 రోజులు ప్రాణాలతో పోరాడుతూ చివరకు చికిత్స జరుగుతున్న సింగపూర్ హాస్పిటల్ లో తుదిశ్వాస వదిలింది.

పోయిన నెలలో బాధితురాలి కుటుంబానికి డిడిఏ ఎమ్ఐజి ఫ్లాట్ ని ఇచ్చి ఆ అమ్మాయి సోదరులలో ఒకతనికి ప్రభుత్వ ఉద్యోగాన్నికూడా ఇచ్చారు.  కానీ బతికుండి బాధలు పడుతున్న మనిషి, ఆ కేసులో కీలకమైన సాక్షి, అతని మీదనే కేసంతా ఆధారపడివుంది. అయినా అతని విషయంలో ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు.  అతను హోంమంత్రిత్వ శాఖకు రాసిన ఉత్తరాన్ని ఆ శాఖ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles