Kathi padmarao convener dalita maha sabha for total prohibition

total liquor prohibition demanded, kathi padmarao, ap dalita mahasabh convener, tenali violence on woman, dharna from 6th may

kathi padmarao convenor dalita maha sabha for total prohibition on liquor

సంపూర్ణ మద్యపాన నిషేధానికి కత్తి పద్మారావు సమరం

Posted: 04/23/2013 10:11 AM IST
Kathi padmarao convener dalita maha sabha for total prohibition

తెనాలి లో దళిత మహిళ బేతల సునీల మీద జరిగిన హింసాకాండ దరిమిలా ఆమె మృతి నేపథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కన్వీనర్ కత్తి పద్మారావు పిలుపునిచ్చారు. 

ఈ నెల 8 న తెనాలిలో బేతల సునీల, ఆమె కుమార్తె రోడ్డు మీద వెళ్తుండగా మద్యంపాన మత్తులో ఉన్న యువత ఆమె కుమార్తె తో అసభ్యంగా ప్రవర్తించటాన్ని ఖండించి అడ్డుకున్న సునీలను రోడ్డు మీద నెట్టి వేయగా ఆమె వేగంగా వెళ్తున్న లారీ కింద పడి తీవ్రంగా గాయపడి, హాస్పిటల్ లో మరణించింది. 

ఈ సంఘటనను గుర్తు చేస్తూ కత్తి పద్మారావు, రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో  మద్యం వలన వచ్చేది పెద్ద మొత్తమని ఈ విషయంలో మెత్తగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు.  అంతే కాకుండా ఎస్ సి ఎస్ టి ఉప ప్రణాళిక అమలులో అర్హతగల ప్రతి ఎస్ సి మహిళకు ఒక ఎకరం భూమిని కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.  అలా చేస్తేనే వ్యవసాయ భూములు పెరిగి కరువు నశిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెనాలి ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలని, నిందితులలో ఒకరు తెనాలి మున్సిపల్ ఛైర్మన్ కొడుకు యు.నాగరాజు అవటం వలన తాత్సారం జరుగుతోందని చెప్తూ, అందుకు వ్యతిరేకంగా తెనాలిలో మే 6 న ధర్నా నిర్వహిస్తానని కత్తి పద్మారావు అన్నారు. 

మద్యపాన నిషేధానికి చేస్తున్న ఆందోళనలో దాన్ని కోరుకుంటున్న పార్టీలు, సంఘాలు ముందుకువచ్చి తనతో కలసి పోరాడాలని పద్మారావు కోరారు. 

 

-శ్రీజ

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles