Nris support chandra babu in pada yatra

nris support babu, nris padayatra abroad, tana ex president komati jayaram, telugu desam party, chandra babu naidu

nris support chandra babu in pada yatra

విదేశాలనుంచి కూడా మేము సైతం

Posted: 04/23/2013 11:50 AM IST
Nris support chandra babu in pada yatra

వేదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా మేము కూడా వస్తున్నాం మీకోసం అంటూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రకు మద్దతు పలికారు.  పలు ప్రాంతాల్లో ప్రవాస భారతీయుల సంఘాలు చంద్రబాబుకి మద్దతుగా సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు.  పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం కోసం అర్చనలు చేయించారు.  అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలోని మిల్సిటాస్ లో సభను నిర్వహించగా అందులో ఎన్ఆర్ఐ విద్యార్థులు సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.  

తెలుగు దేశం పార్టీ నిన్న రాత్రి చేసిన ప్రకటన ప్రకారం అమెరికాలో పలు సంఘీభావ కార్యక్రమాలు తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రోద్బలం, సహాయ సహకారాలతో జరిగాయి.  పశ్చిమ లండన్ లోకూడా తెలుగు దేశం పార్టీకి మద్దతుగా సభల నిర్వహణ జరిగిందని, వారందరితోనూ ఫోన్ లో మాట్లాడామని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేసారు. 

-శ్రీజ

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles