Dharmana prasadarao under heavy security

dharmana prasada rao, srikakulam, sompeta, power plant, developmental activity, security to minister

dharmana prasadarao under heavy security

అభివృద్ధికి బందోబస్తు

Posted: 04/07/2013 08:54 AM IST
Dharmana prasadarao under heavy security

రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చెయ్యటానికి బయలుదేరారు.  బయలుదేరింది అభివృద్ధి కోసమే అయినా భారీ బందీబస్తుతో కదిలారు ధర్మాన. 

బీల సమీపంలో ధర్మల్ ప్లాంట్ స్థాపించవద్దని, దానికి సంబంధించిన జివో 1107 ను వెంటనే రద్దు చెయ్యాలని ఉద్యమకారులు పట్టుబడుతున్నారు.  దానిమీద స్పందించకపోయేసరికి ధర్మాన పర్యటనకు అడ్డుపడి ఆందోళన చెయ్యటానికి ఉద్యమకారులు సిద్ధమయ్యారు.  ఈ ఉద్యమంలో రైతులు, వర్తకులు, మత్స్యకారులు కూడా ఏకమై ప్రతిఘటిస్తున్నారు.  25 గ్రామాలకు చెందిన మత్సకారులు ఈ రోజు ఆందోళన లో భాగంవహించటం కోసం చేపల వేట కోసం సముద్రంలో కి వెళ్ళటం మానుకున్నారు. 

పరిస్థితిని అదుపులో ఉంచటం కోసం పోలీసులు సోంపేటలో భారీ బందోబస్తును చెయ్యటమే కాకుండా, శ్రీకాకుళం నుంచి బయలుదేరిన ధర్మాన పర్యటనలో ఆయనతోపాటు కదిలి వెళ్ళటానికి భారీగా పోలీసు బందుబస్తు ఏర్పాటు చేసారు.  సోంపేటలో అవాంఛనీయమైన సంఘటనలేమీ జరగకుండా ముందు జాగ్రత్తలు కట్టుదిట్టంగా చేసారు. 

-శ్రీజ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles