Privileges under rti act 2005 can be utilized by nris

rti act 2005, right to information, nri, e indian postal orders, e post office portal

privileges under rti act 2005 can be utilized by nris

rti-to-nris.png

Posted: 03/23/2013 09:59 AM IST
Privileges under rti act 2005 can be utilized by nris

rti-205

సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ 2005) చాలా శక్తివంతమైనది.  దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలలోని సమాచారాన్ని తీసుకోవటానికి ప్రతి పౌరుడికీ వెసులుబాటు కలిగించారు.  అయితే ఇందులో ఇంకా సరిచెయ్యవలసిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయన్న విషయాలను దీని మీద వచ్చిన కొన్ని ఆరోపణలను పక్కనబెడితే, ఈ చట్టం కింద తమకు కావలసిన సమాచారాన్ని అందుకుని లబ్ధి పొందినవారు చాలామంది ఉన్నారు.  

కావలసిన సమాచారాన్ని పొందాలంటే మన దేశంలో ఉన్నవాళ్ళకి సులభమయినమాట నిజమే కానీ విదేశాలలో ఉన్న స్వదేశీయులకు సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని పొందటానికి చెల్లించవలసిన  రుసుమును చెల్లించటానికి అవసరమైన ఏర్పాట్లు లేకపోవటం వలన వాళ్ళు ఈ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు.  ఈ అసౌకర్యాన్ని అధిగమించటానికి ఇఐపిఓ (ఎలక్ట్రానిక్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్) సర్వీస్ ను ప్రారంభించారు.

ఎలక్ట్రానిక్ పోస్టల్ ఆర్డర్ ద్వారా సహ చట్టం కింద రుసుము చెల్లించి, సెంట్రల్ పబ్లిక్ ఆఫీసర్స్ ద్వారా ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ కార్యాలయాలనుండి వారికి కావలసిన సమాచారాన్నిఅందకునేవిధంగా ఏర్పాటు చెయ్యబడింది.  దీనివలన ప్రపంచంలో ఎక్కడు ఉన్నా, ఎన్ఆర్ఐలు కూడా తమ డెబిల్ లేక క్రెడిట్ కార్డ్ లను ఉపయోగించి ఇఐపిఓ ద్వారా భారత కరెన్సీలో పైకం చెల్లించ గలుగుతారు.  2005 లో అమలు లోకి వచ్చిన ఈ ఆర్టిఐ చట్టంలోని అంశాలన్నీ వర్తిస్తాయి.  

ఈ సేవలను పొందటానికి ఇ పోస్టాఫీస్ పోర్టల్ http://www.epostoffice.gov.in  లేదా  www.indiapost.gov.in  ని ఉపయోగించుకోవచ్చును.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arvind kejriwal on fast from today
Police helpline numbers on railway tickets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles