Arvind kejriwal on fast from today

arvind kejriwal, aam admi party, soaring electricity and water bills in delhi, civil disobidience call, bhagat singh

arvind kejriwal on fast from today

aam-admi-arvind.png

Posted: 03/23/2013 11:08 AM IST
Arvind kejriwal on fast from today

kejriwal-photo

పెరిగిపోయిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు నుంచి ఢిల్లీలో నిరాహార దీక్షకు పూనుకోవటమే కాక, పౌరులందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనమని పిలుపునిచ్చారు.  కేజ్రీవాల్ తూర్పు ఢిల్లీ సుందర్ నగర్ లో సామాన్యమైన ఇంటిలో సత్యాగ్రహం చేయటానికి సిద్ధమయ్యారు.  

ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రిజస్టరై 21 నుండి రాజకీయ పార్టీగా గుర్తింపుని పొందింది.  దేశ స్వాతంత్రం యోధులు కన్న కలలు సాకారమవటానికి ఇది మొదటి అడుగంటూ కేజ్రీవాల్ ప్రకటించారు.  

విద్యుత్, తాగు నీటి బిల్లులు బాగా పెరిగిపోయాయి.  వాటిని సామాన్యుడు కట్టగలిగే స్థితిలో లేడు కాబట్టి ప్రతఘటించండి.  ఎవరూ బిల్లులను చెల్లించకండి అంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.  కనెక్షన్లను కట్ చేస్తారేమోనని భయపడుతున్నారేమో.  కానీ అందరూ సంఘటితమౌతేనే ఉద్యమం నడుస్తుంది.  మహా అయితే మీ మీద పోలీసు కేసులు పెడతారేమో.  ఏం పరవాలేదు మన ఆఆపా అధికారంలోకి వస్తుంది.  అప్పుడు ఆ కేసులన్నిటినీ మేము ఎత్తేస్తాం అన్నారు కేజ్రీవాల్.  

కేవలం అవినీతి పెరిగిపోవటం వలనే ఆ భారం సామాన్య ప్రజలమీద ఈ విధంగా ఛార్జీల రూపంలో పడుతోందని, అందువలన ప్రభుత్వం ఛార్జీలను సగానికి సగం తగ్గించమని నా డిమాండ్ అన్న కేజ్రివాల్ ఢిల్లీ ప్రజలు సంఘటితులై కరెంటు బిల్లులు కట్టటం పూర్తిగా మానేసేంత వరకూ తన దీక్ష నిరవధికంగా కొనసాగుతుందని అన్నారు.

కేజ్రీవాల్ చేసే ఈ ఉద్యమానికి స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ తమ్ముడు కుల్బీర్ సింగ్ మనుమడు అభిజీత్ సింగ్ తన సహకారాన్ని ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap assembly continues same noisy scenes
Privileges under rti act 2005 can be utilized by nris  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles