Jammu and kashmir assembly ddivided on shinde remarks

afjal guru, susheel kumar shinde, jammu and kashmir assembly

jammu and kashmir assembly divided on shinde remarks

jammu-kashmir.png

Posted: 03/12/2013 05:33 PM IST
Jammu and kashmir assembly ddivided on shinde remarks

j-k-assembly-uproar

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలపై ఈరోజు జమ్మూ కాశ్మీర్ శాసనసభ రెండు గంటల్లో మూడు సార్లు వాయిదాపడింది.  ఉరితీసిన ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక కాయాన్ని అతని కుటుంబీకులకు అప్పజెప్పటానికి నిరాకరించిన షిండే మాటల వలన సభలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ, ఇండిపెండెంట్ శాసన సభ్యుడు ఇంజనీర్ రషీద్, పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ నుంచి హకీమ్ మొహమ్మద్ యాసిన్, సిపిఎమ్ శాసన సభ్యుడు మొహమ్మద్ యూసఫ్ తరిగామి షిండే వ్యాఖ్యలకు అభ్యంతరాలు తెలియజేస్తూ, బడ్జెట్ సెషన్ ని అడ్డుకున్నారు.  షిండే మాటలు పార్లమెంటు, జమ్మూ కాశ్మీర్ శాసన సభలను అగౌరవపరచేలా ఉన్నాయంటూ ఆందోళన చేసారు.

 దానితో కాంగ్రెస్ శాసన సభ్యులు ఒంటరివాళ్లైపోయారు.  వారిలో కూడా కొందరు అఫ్జల్ గురు శరీరాన్ని అతని కుటుంబీకులకు అప్పజెప్పాలని అనటంతో ముస్లిం సభ్యులంతా ఏకమై అందుకు అనుగుణంగా శాసన సభలో నిర్ణయాన్ని తీసుకోవాలంటూ పట్టుబట్టారు.  అప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మిగిలిన హిందూ శాసన సభ్యులంతా దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసారు.  పార్లమెంటు మీద దాడి చేసిన ఉగ్రవాదిని సుప్రీం కోర్టు శిక్ష విధించిన తర్వాత ఆ విషయం మీద చర్చించటానికి ఈ శాసన సభలో అవసరమేముందంటూ భాజపా, నేషనల్ పాంథర్స్ పార్టీ, జమ్మూ స్టేట్ మోర్చా అభ్యంతరం తెలియజేసాయి.  జాతీయతకు వ్యతిరేకంగా మాట్లాడటం, సభా సమయాన్ని వృధా చెయ్యటం చేస్తున్నారంటూ ప్రతివాదనకు దిగారు.

ఈ గందరగోళానికి తెరదించటానికి లా మినిస్టర్ సైయిఫుల్లా లేచి నిలబడి, ఈ సున్నితమైన విషయంలో అందరి మనోభావాలనూ సభ గౌరవిస్తుందంటూ ప్రకటించారు.  కాకపోతే, ఆయన మాటల్లో అఫ్జల్ గురు సాహెబ్ అని అనటం తో మరోసారి చిచ్చురేగింది.  దేశ గౌరవాన్ని మంటగలుపుతూ ఒక ఉగ్రవాదికి, ఉరిశిక్ష విధించి అమలుపరచిన దోషికి అంత గౌరవమిచ్చి మాట్లాడుతారా అంటూ ఆందోళనచేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi announces tourism awards
Nirbhay missile deviatedjpg  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles