Nirbhay missile deviatedjpg

nirbhay-missile-deviated.jpg

Posted: 03/12/2013 02:51 PM IST
Nirbhay missile deviatedjpg

nirbhay-missile

డిఆర్ డివో లాంచ్ చేసిన సుదూర ప్రయాణం చెయ్యగల మిసైల్ నిర్భయ్ బయలుదేరిన 15 నిమిషాల తర్వాత 20 నిమిషాల లోపులోనే నిర్దేశిత దిశలో పోకుండా గతి తప్పటం వలన ప్రయోగాన్ని నిలిపివేయవలసి వచ్చింది.

ఒడిశా కోస్టల్ ప్రాంతంలోని చందీపూర్ నుంచి ప్రయోగించిన మిసైల్ దారి తప్పి కోస్ట్ వైపు పోవటంతో కోస్టల్ భద్రతా దృష్ట్యా ప్రయోగాన్ని నిలిపివేయటం జరిగింది.  రెండు అంచలుగా పనిచేసే ఈ మిసైల్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది.  నిలిపివేసే సమయానికి మిసైల్ భూమికి నాలుగున్నర కి.మీ ఎత్తులో ప్రయాణిస్తోంది.

నిజానికి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసివుంది.   నిర్దేశించిన ఆ దారి పొడవునా డిఆర్ డి ఎల్ మిసైల్ ని గమనించే స్టేషన్లను ఏర్పాటు చేసింది.  

డిఆర్ డి వో చీఫ్ కంట్రోలర్  అవినాశ్ చందర్ మాట్లాడుతూ, మిసైల్ 30 శాతం పనిని పూర్తిచేసుకుందని, గతి తప్పి పోయేంత వరకూ అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయని అన్నారు.  సాధించినంత వరకూ బాగానే ఉందన్న తృప్తిని వెలిబుచ్చారాయన.  అయితే మిసైల్ గతి తప్పటం ఎందుకు జరిగిందో పరిశీలించి తర్వాత ప్రయోగంలో ఆ లోపాన్ని సవరించుకుంటామన్నారు.

మిసైల్ లో ప్రత్యేకత ఏమిటంటే అది భూమి నుండి 500 మీటర్ల నుండి 10 కిలో మీటర్ల ఎత్తులో పయనిస్తూ కొండల్లాంటి అవరోధాలుంటే వాటిని చుట్టి మరీ పోగలుగుతుంది.  ఈ మిసైల్ రాకను కనిపెట్టటం కష్టమని కూడా చెప్పారు.  అంతా బాగుంది కానీ అనుకున్న పని సంపూర్ణం కాలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jammu and kashmir assembly ddivided on shinde remarks
Italy refuses to surrender mariners  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles