Allocations of heavy amounts in budget

budget 2013-14, chidambaram, financial budget presentation

allocations of heavy amounts in budget

heavy-budget.png

Posted: 02/28/2013 03:58 PM IST
Allocations of heavy amounts in budget

chidambaram-with-budget_papers

బడ్జెట్ లో భారీ వ్యయాలు, కేటాయింపులు, ఆదాయ వనరులు-

1.    ఢిల్లీ మెట్రో ఫేజ్ 3 కి 7701 కోట్ల రూపాయలను కేటాయించటం జరిగింది.  దీనివలన దేశ రాజధానిలో రవాణా సౌకర్యం మరింత ఆధునికం, సౌకర్యవంతం అవుతుందని చిదంబరం అన్నారు. 
2.    దేశ రక్షణ కోసం 2 లక్షల మూడు వేల డెబ్భైరెండు కోట్ల రూపాయలను కేటాయించారు.
3.    గాలితో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కోసం 800 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది.
4.    ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 100 టన్నుల కెపాసిటీగల రెండు ఓడ రేవులను నిర్మించటానికి నిధులను ఏర్పాటు చేసారు.
5.    టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ద్వారా వస్త్రాల ఉత్పత్తి కోసం 50 కోట్ల రూపాయల వ్యయంతో అప్పరల్ పార్క్ లను నిర్మిస్తారు.
6.    చేనేత పనివారి సంక్షేమం కోసం హాండ్లూమ్ శాఖకు 96 కోట్ల రూపాయలను కేటాయించారు.  అది 150000 మంది చేనేత కార్మికులకు లాభం చేకూరుస్తుంది.
7.    వచ్చే సంవత్సరం మొదటి ఆరు నెలలలోనే 3000 కి.మీ రోడ్డు నిర్మాణాలను చేపడతారు.
8.    నిర్మాణరంగంలో 100 కోట్ల పైన పెట్టుబడి పెట్టినవారికి ప్రోత్సాహంగా డిప్రీసియేషన్ కింద  15 శాతం అనుమతించబడుతుంది.
9.    ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఢిల్లీ, ముంబై కాక మరో ఏడు నగరాలను ఎంపికచేయటమైంది. అందులో బాగంగా బెంగళూరు-ముంబై కారిడార్ పని మొదలైంది.
10.    వ్యవసాయరంగంలో కూడా అభివృద్ధికి కేటాయింపులు జరిగాయి.  అందులో, 500 కోట్ల రూపాయలు పంటలలో మార్పులకు, 200 కోట్ల రూపాయలు పోషక విలువలుగల పంటలను పెంచటానికి, రైతు ఉత్పతిత సంఘాలకు 50 కోట్లు కేటాయించబడింది.


11.    307 కోట్ల రూపాయలతో జాతీయ పశు పెంపకాల అభివృద్ధి చేపట్టబడుతుంది.
12.    ఆహార భద్రత కోసం కేటాయించిన 10000 కోట్ల రూపాయలను పార్లమెంటు అనుమతిస్తుందని ఆశిస్తున్నానన్నారు చిదంబరం.
13.    మానవ వనరుల శాఖకు 65867 కోట్ల రూపాయలు కేటాయించారు.
14.    మధ్యాహ్న భోజనాలకు 17700 కోట్ల రూపాయలను కేటాయించారు.
15.    త్రాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 15260 కోట్ల కేటాయింపు జరిగింది.
16.    గ్రామీణాభివృద్ధికి కేటాయింపును 46 శాతం పెంచుతూ 80294 కోట్లకు పెంచారు.
17.    గ్రామీణ ఉపాధి పథకం కింద 33000 కోట్లను కేటాయించటం జరిగింది.
18.    షెడ్యూల కులాల సంక్షేమానికి 41000 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది.
19.    మహిళా సంక్షేమానికి 97000 కోట్ల రూపాయలను కేటాయించారు.
20.    వికలాంగుల సంక్షేమానికి 110 కోట్ల రూపాయలు కేటాయించారు.
21.    ఆరోగ్య శాఖకు 37330 కోట్ల రూపాయలను కేటాయించారు. 50000 కోట్ల రూపాయలకు పన్ను మినహాయింపు గల నిర్మాణ బాండ్లను విడుదల చేస్తారు.

50000 కోట్ల రూపాయలకు పన్ను మినహాయింపు గల నిర్మాణ బాండ్లను విడుదల చేస్తారు.

–శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Juvenile justice court slapped charges on minor
Ruling parties are in front in 3 states counting of votes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles