Juvenile justice court slapped charges on minor

delhi gang rape, juvenile justice court, minor charged

juvenile justice court slapped charges on minor also in gang rape case

minor-charged-by-jjc.png

Posted: 02/28/2013 05:43 PM IST
Juvenile justice court slapped charges on minor

gang-rape-victim

డిసెంబరు 16 2012 న ఢిల్లీలో ఒక ప్రైవేటు బస్సులో జరిగిన సామూహిక అత్యాచరం నేరారోపణ మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 17 సంవత్సరాల మైనర్ ని జువెనైల్ కోర్టుకి అప్పగించారు.  అయితే ఈ రోజు ప్రధాన మాజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ అతని మీద మిగతా ఐదుగురి లాగానే మోపిన నేరాలన్నిటినీ అనుమతించారు.  అందులో సామూహిక అత్యాచారం, హత్యా ప్రయత్నం, హత్య, అపహరణ, దోపిడీ, సాక్ష్యాధారాలను నాశనం చెయ్యటం వంటి నేరాలున్నాయి. 

అంతకు ముందు ఆ మిగిలిన ఐదుగురితో పాటు ఈ మైనర్ కుర్రవాడి మీద కూడా పోలీసులు పిఐఆర్ (పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్) ని ఫైల్ చేసారు.  అది ఛార్జి షీట్ తో సమానమే. 

ఆరోజు ఆ యువతి మీద అత్యాచారం చెయ్యటానికి ముందుగానే ఆ మైనర్ ఒక కూరగాయల దుకాణం నుంచి బలవంతంగా దోపిడీ చేసాడు.  అత్యాచారానికి గురైన అమ్మాయితో పాటు బస్సులో ఎక్కిన ఆమె స్నేహితుడు ఈ మైనర్ బారిన పడి దెబ్బలు తిన్నాడు.  ఈ రెండు కేసులలోనూ నిరపరాధినని జువైనైల్ కోర్టు తలుపు తట్టాడు కానీ జరిగిన అపరాధ తీవ్రతనుబట్టి కోర్టులో అతనికి చుక్కెదురైంది. మహిళ మీద అత్యాచారం చేసినవాడిని మైనర్ గా ఎలా పరిగణిస్తారన్నది మేధావుల వాదన కూడా ఎలాగూ ఉంది.  

మార్చి 12 నుండి ఈ మైనర్ మీద మోపిన నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను రికార్డ్ చేస్తారు. 

–శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Blood donation camp for bomb blast victims
Allocations of heavy amounts in budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles