Political leaders comments on others depend

indian politics, politician, prime minister, party system

political leaders comments on others depend on the person belong to which party

political-party-opposition.png

Posted: 02/26/2013 03:42 PM IST
Political leaders comments on others depend

parliament

నా పార్టీ వాడా అయితే సరే, కాదా అయితే నేను ఒప్పుకోను- ఇదీ ఈ నాటి రాజకీయ ధోరణి.  నాయకుడంటే పెద్ద, ప్రజల సంక్షేమం కోసం తన శక్తియుక్తులను ధారపోస్తూ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజాహితంలో పనిచేసేవాడు, తెలివైనవాడు, మేధావి, నిజాయితీతో పనిచేసేవాడు అనే అర్థాన్ని దాదాపూ అందరూ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. 

తన పార్టీ మనిషి కాకపోతే, అతను ఏమి మాట్లాడినా ఏమి చేసినా సరే అదంతా రాజకీయమని, అధికారం కోసం చేస్తున్నారని, తనకోసమే, సీటుకోసమే కానీ ప్రజలకు మంచి చేద్దామని కాదనీ విమర్శించటం పరిపాటైపోయింది.  అలాగే తన పార్టీ నాయకుడు ఏం మాట్లాడినా ఏం చేసినా సమర్థించటం కూడా తమ బాధ్యతగా స్వీకరిస్తున్నారు చాలామంది.  అలా సమర్థించకపోతే పార్టీకి వ్యతిరేకమని, క్రమశిక్షణా రాహిత్యం కింద జమకట్టాలని వాళ్ళపై ఒత్తిడి తేవటం కూడా మామూలైపోయింది, అది చట్టబద్ధం కూడా అయింది.  పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత ప్రకటించటం, సభాపతికి ఫిర్యాదు చెయ్యటం ఎంత వరకూ సబబో ఆ చట్టాన్ని తెచ్చినవారికే తెలియాలి. 

విద్యుత్ ధరల పెంపు కోసం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కార్యక్రమం పెడితే విపక్షలు దాన్ని కొనసాగకుండా చెయ్యటం, ఏం జరిగినా అధికార పక్షాన్ని విమర్శించటం చేస్తున్నారు.  ప్రతిపక్ష నాయకులు ఓదార్పు యాత్రో లేక మరేదో పాద యాత్రో అనే పేరుతో ప్రజలలోకి వెళ్తుంటే అధికార పక్షం ఎద్దేవా చెయ్యటం జరుగుతోంది.  పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదన పూర్తి కాకుండానే అడ్డు తగలటం ఎంత వరకూ సమంజసమో తెలియదు.  మంత్రిగా తన ప్రతిపాదనను పూర్తిగా ప్రవేశపెట్టే హక్కు కూడా లేదా.  పూర్తిగా వినకుండానే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ ప్రకటనలు చేస్తుంటే, భేష్ భేష్ చాలా బావుంది, న భూతో న భవిష్యతి అన్నట్టు చక్కగా తయారు చేసారు బడ్డెట్ ని అంటారు ప్రధాన మంత్రి. 

మొత్తం మీద ప్రజలందరికీ అసలేం జరుగుతోందన్నది అర్థం కాకుండా పోతోంది.  మేధావుల చర్చల్లా కాకుండా, ఎక్కడ ఏ సందు దొరుకుతుందా అని ప్రతివారూ ఎదురు చూస్తున్నట్టే ఉంటోంది.  అవకాశం దొరకగానే, తన పార్టీ వాళ్ళకి శహభాష్ లూ, అవతలి పక్షం వారికి శాపనార్థాలు ఇదీ నేటి రాజకీయ వైఖరి.

పార్లమెంటు అనే దానికి ఒకప్పుడు చాలా గౌరవ స్థానం ఉండేది.  పార్లమెంటులో ఉండవలసిన పద్ధతి, మాట్లాడవలసిన పద్ధతి అంటూ ఉండేవి.  అందుకే అన్ పార్లమెంటరీ అనే పద ప్రయోగాలు జరుగుతాయి.  కానీ అన్ పార్లమెంటరీ అంటే మంచి అర్థంలోకి మారేట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహార శైలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot air balloon crash near luxor in egypt kills 19 tourists
Parliament adjournedpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles