Fire accidents to be prevented

fire accidents, short circuits, loss due to fire

fire accidents to be prevented by checking possibilities of short circuits

fire-accidents.png

Posted: 02/19/2013 09:28 AM IST
Fire accidents to be prevented

     హైద్రాబాద్ ఆసిఫ్ నగర్ లోని గోదాములో అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.  గోదాములోని కలప పూర్తిగా కాలిపోయింది.  రెండు గంటల సేపు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక దళాలు అక్కడి పరిస్థితిని పరిశీలించి, బహుశా విద్యుత్ షార్ట సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగివుండవచ్చని అంటున్నారు. 

     ఏ కారణం తెలియకపోతే షార్ట్ సర్క్యూట్ కి దోషాన్ని అంటగట్టి వదిలేయటం పరిపాటైపోయింది.  ఒకవేళ అదే కారణమైతే విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్త ఎందుకు తీసుకోరు.  ఇంత ఆధునికతను సంతరించుకున్న తర్వాత కూడా ఇంకా విద్యుత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోలేమా.  విద్యుత్ ఉపకరణాలు, వైర్లు, కనెక్షన్లకి సంబంధించిన ఉత్పత్తులు, వాటి అమరికలను జాగ్రత్తగా పరిశీలించరెందుకని.  ఇప్పటికీ చాలా పరిశ్రమలు, గోదాములలో వైర్లు నగ్నంగా (ఇన్సులేషన్ లేకుండా) దర్శనమిస్తాయి. 

     జాగ్రత్తనేది ఎప్పుడూ ఉండాలి కానీ, మొదట్లో కొన్నాళ్ళు జాగ్రత్తలను పాటించి, ఏమీ కాలేదుగా అనుకుంటే, పొంచి ఉన్న ప్రమాదం ఎప్పుడైనా కాటేయవచ్చని ఎందుకనుకోరు.  భద్రతా చర్యలు తీసుకోరెందుకు, సురక్షా ప్రణాళికలను తయారుచేసుకోరెందుకు.  ఇలాంటి వాటిని నియంత్రించే ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నాయి. 

     ఇంకా పూర్తిగా చలికాలం పోయి వేసవి నెత్తి మీదకు రాకముందే చెదురు మదురు అగ్ని ప్రమాద వార్తలు అందుతున్నాయి.   పరిశ్రమల్లో అలంకార ప్రాయంగా కనిపించే ఫైర్ ఎక్స్టింవిగషర్లు చాలా సందర్భాల్లో ప్రమాద సమయంలో ఉపయోగ్యంగా ఉండవు.  ఇప్పటికైనా సంబంధిత శాఖలు అప్రమత్తమై ఇలాంటి ప్రమాదాలను నిరోధించగలిగితే వ్యక్తులకూ, సంస్థలకూ, దేశానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Break in political pada yatras
Minister jana reddy not to take cm post without t state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles