Nagaland home minister in police custody

nagaland, elections, nagaland home minister

nagaland home minister caught with heavy currency and arms.

nagaland-home-minister.gif

Posted: 02/18/2013 12:00 PM IST
Nagaland home minister in police custody

     homeభద్రతా శాఖను నియంత్రించే హోం మంత్రే స్వయంగా తన వాహనంలో ఆయుధాలను, భారీ మొత్తాన్ని తరలిస్తూ పట్టుబడ్డ ఉదంతం నాగాలాండ్ లో చోటుచేసుకుంది.

     ఫిబ్రవరి 23 న జరుగనున్న ఆ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీలలో వోకా జిల్లాలో పట్టుబడ్డ నాగాల్యాండ్ హోం మంత్రి ఇమ్కాంగ్ ఎల్ ఇంచేస్ ను దరిమిలా పోలీసులు అరెస్ట్ చేసారు.   ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీలలో ఆయన కారులో కోటి రూపాయల వరకూ నగదు, మారణాయుధాలు లభించాయి.  ఈ సంఘటనతో ఎన్నికలు ఏ మేరకు విషపూరితమయ్యాయి, ప్రజాహితంలో స్పచ్ఛందంగా ఎన్నికలు జరిగే అవకాశానికి ఎంత దూరం వెళ్తున్నామన్నది అర్థమౌతోంది.

     సినిమాల్లో చూపించటం,  ఊహించి చేసే ఆరోపపణలు కాకుండా ఇటువంటి ప్రత్యక్ష పరిణామాలు ఓటర్లను నీరసపరచటం ఖాయం.

     పటుటబడ్డ హోం మంత్రి నాగాల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందినవారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Last statement of afjal guru indicates pride
Anna hazare delivers an inspiring speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles