Anna hazare delivers an inspiring speech

anna hazare, fighting against corruption, anna hazare for anti corruption

anna hazare delivers an inspiring speech at secunderabad

anna.gif

Posted: 02/18/2013 11:23 AM IST
Anna hazare delivers an inspiring speech

     anna-in-ap

     సంఘసంస్కర్త, దేశంలో అవినీతి నిర్మూలనం కోసం కంకణం కట్టుకున్న గాంధేయవాది అన్నాహజరే ఆదివారం సికింద్రాబాద్ లో ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగంలో యువతను ఉత్సాహపరస్తూ మాట్లాడారు.  అవినీతికి వ్యతిరేకంగా తాను యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఆలోచించానని, నిరుపేద కుటుంబంలో జన్మించిన తను ఒకసారి ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ఆలోచించానని, కాని అది కాదు మార్గం, ప్రజాసేవలో పాల్గొని పదిమందికీ మంచి చెయ్యటమే కర్తవ్యమని నిర్ణయించుకున్నానని చెప్తూ, విత్తనం ఎలా మొలకెత్తి వేలాది గింజలను ఉత్పత్తి చేస్తుందో అలాగే ప్రతి యువకుడూ ముందుకు వచ్చి అవినీతి వ్యతిరేక ఆందోళనలో పాలుపంచుకోవాలని అన్నారు.  అదే విత్తనం భూమిలోపలికి పోనట్లయితే అది పిండి మరలోకి పోతుందని, అంతటితో దాని జీవితం అంతమైపోతుందని, అలా కాకుండా మొలకెత్తినట్లయితే అలాంటి అన్నోత్తత్తికి దారితీస్తుందని, యువత కూడా అదేవిధంగా దేశసేవలో భాగం వహిస్తే దేశానికి మేలు జరుగుతుందని అన్నా అన్నారు. 

     అయితే ఆందోళనలో పాల్గొన్నవారికి సుఖ సౌకర్యాలను విడనాడాల్సిన అవసరం పడుతుందని, బాధలను ఓర్చుకోవలసి వస్తుందని, దానికి సిద్ధపడ్డవారు తనకు ఎస్ఎమ్ఎస్ చెయ్యమని ఆయన అన్నారు.  మీరు పోరు సల్పండి, మేమంతా మీ వెనకాలే ఉన్నామన్న హామీలు కాదు నాకు కావలసింది.   మీరంతా భాగస్వామ్యం వహించాలి.  ఇందులో నాయకులంటూ ప్రత్యేకంగా ఏ ఒక్కరూ ఉండరు.  అందరూ నాయకులే.  కోర్ కమిటీలు అసలే ఉండవు.  అధికార వ్యామోహంలో పడ్డ రాజకీయవేత్తలు ఆఖరి శ్వాస వరకూ కుర్చీలకే అంటుకుని ఉండాలని కోరుకుంటున్నారని, స్వార్థం అంతగా పెరిగిపోయిందని ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయాలను నిరసిస్తూ, యువతను ముందుకు రమ్మని పిలుపునిచ్చారు అన్నా.

     ఎన్నికల విధానంలో కూడా మార్పు రావటం కోసం తాను ప్రయత్నిస్తున్నానని, ఎన్నికల్లో నిలబడ్డ ఏ అభ్యర్థీ సరైన వాడు కాక అందరూ గూండాలు రాజ్యమేలుదామని చూస్తున్న తరుణంలో, ఓటర్లు ఎవరి పక్షంలోనూ ఓటు వెయ్యకుండా, తిరస్కరించే విధానం అమలులోకి రావలసివుందని, అందుకోసం పోరాడుతానని అన్నా హజరే అన్నారు.  ఎంతో పోరాడబట్టే సమాచార హక్కు ఈ రోజు అమలులోకి వచ్చిందని, అలాగే తిరస్కరణ చట్టం గురించి కూడా పోరాటం సలుపుతానని అన్నారు. 

     పెళ్ళి చేసుకుంటే తనదో చిన్న కుటుంబం, చిన్న పరిధిలో తన ఆలోచనలు, ప్రణాళికలూ ఉండేవని, అలా కాకుండా తను బ్రహ్మచారిగా ఉండిపోబట్టే జగమంత కుటుంబంగా తాను ఎంతో ఆత్మసంతృప్తితో జీవితాన్ని సాగిస్తున్నానని అన్నా హజరే అన్నారు.   120 కోట్ల జనాభాలో ఇంకా మొద్దునిద్రపోతున్న కుంభకర్ణులున్నారని, వారిని జాగృతం చేసేందుకు తాను చేసే ప్రయత్నంలో కనీసం 6 కోట్ల వరకైనా ఫలితం వస్తుందని తన విశ్వాసాన్ని ప్రకటించారు.  తనతో కలిసి పోరాడదామనుకునేవారు,  9923599234 కి సంక్షిప్త సందేశాన్ని (ఎస్ఎమ్ఎస్) పంపవలసిందిగా ఆయన కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagaland home minister in police custody
Bjp complains against sharmila and brother anil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles