Tirumal geared up for rathasaptami tomorrow

tirumala and temples of sun geared up for

rathasaptami.gif

Posted: 02/16/2013 02:43 PM IST
Tirumal geared up for rathasaptami tomorrow

suryaprabha    

    తిరుమలలో ఎప్పటిలాగానే మాఘ శుద్ధ సప్తమి నాడు అనగా రేపు ఆదివారం ఉదయం నుంచీ స్వామివారికి విశేష సేవలుంటాయి.  అందులో భాగంగా, శ్రీవారు ఏడు వాహనాలను అధిరోహించి మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.  ముందుగా సూర్యప్రభ వాహనం, తర్వాత చిన్న శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, ఇలా రోజంతా ఒక్కో వాహనం మీద ఊరేగిన స్వామివారు రాత్రికి చంద్రవాహనాన్ని అధిరోహిస్తారు.  అదే  సంఖ్యలో ఉదయం సూర్యప్రభతో మొదలై రాత్రి చంద్రప్రభ వరకూ వివిధ వాహనాలను అధిరోహిస్తారు.  మధ్యాహ్నం చక్రస్నానం ఉంటుంది.
 
     ఈ సందర్భంగా నిత్యం జరిగే కళ్యాణోత్సవం, అర్జిత సేవలు, ఉంజల సేవలలాంటి కొన్ని సేవలను రద్దు చేసారు.   స్వామివారిని దర్శనం చేసుకోవటానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తితేదే యాజమాన్యం భక్తులకు విశేష సౌకర్యాలను, భక్తులు నిరుత్సాహపడకుండా ఉండటం కోసం ప్రసిద్ధ తిరుమలేశుని లడ్డూలను 5 లక్షల వరకూ తయారుగా పెట్టుకోవటం లాంటి ఏర్పాట్లను చేసారు.
 
     మాఘమాసంలో ఏడవరోజున అంటే రథసప్తమినాడు సూర్యుడు ఉత్తరం వైపుగా తన రథాన్ని తిప్పుకుంటాడు అని హిందువుల నమ్మకం.  నిజానికి ఉత్తరాయణం సంక్రాంతికే ప్రారంభమైనా, రథసప్తమి నాడు సూర్యుని రథం ఉత్తరం దిక్కుగా నిజమైన తిరుగు ముఖం పడుతుంది. ఈ పర్వదినాన సూర్యుని ఆలయాలు కూడా భక్తులతో పోటెత్తుతాయి.  మన రాష్ట్రంలోనే శ్రీకాకుళంలో అరసవిల్లిలోను, ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయాల్లోనూ భక్తులు ప్రత్యక్ష దేవుడైన సూర్యదేవుని దర్శించుకుని పునీతులౌదామని ఆరాటపడతారు.
 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Land grabbing in spiritual garb
Sims company cheats people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles