Sims company cheats people

"sims company, secured investment making service private limited, visakapatnam anakapalli, lockout, agent rambabau suicide, customers

SIMS company in Anakapalli of Visakhapatnam District cheated the people by turning away the board after collecting crores of money through deposits

SIMS Company Cheats People.png

Posted: 02/16/2013 12:10 PM IST
Sims company cheats people

sims_company

విశాఖపట్నం జిల్లాలో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన సిమ్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ తన కస్టమర్లకు భారీ కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేసింది. లక్ష రూపాయలు కట్టండి... నెలకు పదివేల రూపాయలు వడ్డీ పొందండి అంటూ కస్టమర్లను నమ్మించి, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున శాఖలు ఏర్పాటు చేసి, భారీగా డబ్బలు వసూలు చేసి, దాదాపు 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డుతిప్పేసింది. దీంతో బాధితులు లబో దిబో అని అంటున్నారు. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం నర్సీపట్నం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక్కడి సిమ్స్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయానికి తాళాలు వేశారు. డైరెక్టర్ పరారీలో ఉన్నాడు. మొదట్లో వడ్డీలు బాగానే చెల్లించిన ఈ సంస్థ తరువాత చెల్లింపులను ఆపివేసింది. గత కొద్ది రోజుల నుండి బాకీలను చెల్లిస్తామంటూ నమ్మబలికిన ఆ సంస్థ డైరెక్టర్లు నిన్నటి నుండి కనిపించకుండా పోవడంతో, ఈ సంస్థ బోర్డు తప్పేసినట్లు అర్థం చేసుకున్న బాధితులు, ఆ సంస్థ శాఖల పై దాడులకు దిగారు. ఇక ఈ సంస్థకు చెందిన ఓ ఏజెంటు సత్తిబాబు అనే అతను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని బాధితులు గంటా శ్రీనివాసరావుకు వివరించగా బాధితులు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirumal geared up for rathasaptami tomorrow
Shirish bharadwaj join in bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles