Land grabbing in spiritual garb

land grabbing, brother anil, subash patri, saviors

land grabbing in spiritual garb by so called non profit organizations.

land-grab.gif

Posted: 02/16/2013 04:24 PM IST
Land grabbing in spiritual garb

    

     భూగోళం ఎంత ఉన్నా సరిపోదు.  ఎంత భూమి మీద నా సొంతం అని గిరిగీసుకున్నా తృప్తి ఉండదు.  భూమిని కైవసం చేసుకోవటానికి ఉన్న మార్గాలలో దౌర్జన్యానిది ఎప్పుడూ పైచేయే.  కాకపోతే అది భూకబ్జా నేరం కింద ఎప్పుడో ఒకప్పుడు చట్టం పరిధిలోకి రాకమానదు.  కానీ అలా వచ్చినా, కబ్జాదారులూ కొన్ని ఆధారాలను చూపించి, కేసుని ఎటూ తేలకుండా చేసి అది కొన్నాళ్ళపాటు కోర్టు నిర్ణయం వచ్చేంతవరకూ ఎవరికీ చెందకుండా చేసే అవకాశమూ ఉంది. 


     ఇక రెండవ మార్గం ఆధ్యాత్మిక, మత పరమైన కట్టడాలతో, దాన్ని లాక్కోవడం.  ఒక గుడి కట్టి కాని, లేదా ప్రార్థనా మందిరాలను నిర్మించి కానీ, లేక నిర్మించటానికి కాని భూమిని వశపరచుకోవటం.  రహదారిలో అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించగలిగిన ప్రభుత్వం మతపరమైన వివాదాలు చెలరేగకూడదనే ఉద్దేశ్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల జోలికి పోదు.  రోడ్డు వెడల్పయిన తర్వాత అలాంటి కట్టడాలు కొట్టొచ్చినట్టుగా కనపడతాయి. 


     క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ మీద మణికొండ దరి జాగిర్ కంచె, పొక్కులవాడలలో భూకబ్జా కేసులున్నాయి.  సదరు భూమి తాలూకూ బాధితుడు యాదయ్య తనను బ్రదర్ అనిల్ మనుషులు వేధిస్తున్నారని వాపోతున్నారు.  అయితే తెలంగాణాకు చెందిన క్రైస్తవ సంఘం అతనికి మద్దతు పలుకుతూ, అనిల్ ని మతం నుంచి బహిష్కరించటానికి సిద్ధమని తెలియజేసింది. 


     కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ కడ్తాల్ లో ధ్యానగురు సుభాష్ పత్రి ఆధ్వర్యలో ధ్యానకేంద్రంవారు నిర్మించిన పిరమిడ్ మీద కూడా ఇలాంటి వార్తలే వినవచ్చాయి.  సేవా తర్పరతో పనిచేస్తున్నామని చెప్తున్న సంస్థలు పౌరులను ఎవరినీ బాధించకుండా పనిచేస్తేనే హర్షనీయం.  పదిమందికీ ఉపయోగపడుతుందని చేసే పనులలో ఏ ఒక్కరినీ ఇబ్బందిపెట్టకుండా ఉంటేనే ఆయా సంస్థలపట్ల సద్భావన కలుగుతుంది.

 
     హిందూ అవతారాలన్నీ భూమ్మీద ధర్మాన్నినెలకొల్పి శాంతిని కలుగజేయటానికి ఉద్భవించినవే.  అన్ని మతాల ప్రవక్తలూ శాంతికాములే, శాంతిని ప్రభోదించినవారే.  అందులో ముఖ్యంగా వరాహావతారం మునిగిపోతున్న భూదేవిని రక్షించటానికి ప్రకటితమైనదే.  అటువంటి దేవుళ్ళ పేరుతో భూమిని లాక్కోవటం శోచనీయం.


-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bench and bargif
Tirumal geared up for rathasaptami tomorrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles