Sharmila padayatra volume two

sharmila padayatra, ysr congress, ysrcp, sharmila, jagan, vijayamma, congress, tdp, ap politics, sharmila anil, brother anil, jagan bail,

sharmila padayatra volume two

27.gif

Posted: 02/05/2013 05:38 PM IST
Sharmila padayatra volume two

sharmila-cm-ysrcp-647x450

       నేను జగనన్న వదిలిన బాణాన్నంటూ పాదయాత్ర చేపట్టిన  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రేపటి  (బుధవారం) నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది.  కాంగ్రెస్ ప్రభుత్వ‌ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అసమర్థ, ప్రజాకంటక పరిపాలనకు, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి కుట్రపూరిత రాజకీయాలను ఈ మలివిడత యాత్రలో షర్మిల తూర్పారబట్టాలని ప్రణాళిక సిద్ధంచేసుకున్నట్టు తెలుస్తోంది. 
         ఇదిలా ఉండగా, గడచిన డిసెంబర్ నెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని బిఎన్ రెడ్డి నగ‌ర్‌లో జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మోకాలికి గాయం కావడంతో.. మరుసటి రోజు తుర్కయాంజాల్ సమీపంలో పాదయాత్రకు ‌విరామం ప్రకటించారు షర్మిల.  గాయం నుంచి శ్రీమతి షర్మిల కోలుకోవడంతో బుధవారం మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు.
        రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ గార్డెన్సు నుంచి బుధవారం ఉదయం 9.30 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది.  అక్కడి నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర రాగన్నగూడ, మన్నెగూడ, ఒఆర్‌ఆర్‌, బొంగులూరు గేట్‌ మీదుగా కొనసాగుతుంది. బొంగులూరు గేట్‌ సమీపంలో ఉన్న కల్లెం జగ్గారెడ్డి గార్డెన్సులో పాదయాత్రకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. అనంతరం ఆమె మంగలంపల్లిగేట్, శేరిగూడ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకుంటారు.  ఇబ్రహీంపట్నంలో జరిగే బహిరంగసభలో శ్రీమతి షర్మిల అభిమానులు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల ఇబ్రహీంపట్నంలోని కెఎన్‌ఆర్‌ గార్డెన్సులో రాత్రి బస చేస్తారు. మొత్తంగా పాదయాత్ర బుధవారంనాడు 15.5 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara lokesh targets sakshi
Gone counter on kavitha comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles