కాలు నొప్పితో మూడు రోజుల పాటు విరామం తీసుకొని, ‘వస్తున్నా మీకోసం ’ పాదయాత్రను మళ్ళీ నిన్న క్రిష్ణా జిల్లాలో నుండి ప్రారంభించిన చంద్రబాబు నాయుడుకు అక్కడి విద్యార్థుల నుండి కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొని కాస్తంత ఇబ్బంది పడ్డారు. పాదయాత్ర సందర్భంగా విద్యార్థులతో భేటీ అయి మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్ధులలో ఒకరు చంద్రబాబుకు ఓ ప్రశ్న వేశారు. సార్... మీరు సీఎంగా ఉన్నప్పుడు హైదారాబాద్ ని ఐటీ రంగంలో అభివ్రుద్ధి చేశారు. దాంతో ఉద్యోగాలు వస్తాయని మేం ఇంజనీరింగ్ చేశాం. ఇప్పుడేమో మీరు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు. మరి ఇప్పుడు వారు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలంటున్నారు ? మాలాంటి వారు అక్కడ ఎలా ఉద్యోగాలు చేయాలి ? అని అడగటంలో చంద్రబాబుకు కాస్తంత తడబాటుకు గురైనట్లు సమాచారం.
హైదరాబాద్ తరువాత విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకూ కనెక్టివిటీ తీసుకొచ్చి ఐటీ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్న దశలోనే ఎన్నికలొచ్చిఓడిపోయాం'' అని బాబు బదులిచ్చారు. విజయవాడలో సాఫ్ట్‌వేర్ టెర్మినల్ పార్క్‌ను తమ హయాంలో తలపెట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకొనేలేదన్నారు."మీ ఊళ్లలోనే మీరు ఉద్యోగాలు చేయాలనేది నా కోరిక'' అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముందు ముందు పాదయాత్రలో చంద్రబాబుకు తెలంగాణ పై మరిన్ని చిక్కులు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more