Nukarapu surya prakash raoreleased

Nukarapu Surya Prakash rao, Surya News Paper,

Surya News Paper MD Nukarapu Surya Prakash raoReleased

Nukarapu Surya Prakash raoReleased.png

Posted: 02/02/2013 10:19 AM IST
Nukarapu surya prakash raoreleased

nukarapuతప్పుడు పత్రాలతో, ఫోర్జరీ సంతకాలతో బ్యాంకును మోసం చేసిన కేసులో రెండేళ్ల శిక్షపడిన సూర్య పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాష్ రావు తన శిక్షకాలం పూర్తికాక ముందే జైలు నుండి విడుదల అయ్యారు. వివరాల్లోకి వెళితే...1994లో తప్పుడు, ఫోర్జరీ పత్రాలతో విజయా బ్యాంకు నుంచి రూ.2.67 కోట్లు రుణం తీసుకొన్నారు. ఆ మొత్తాన్ని ఎగవేయడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. కేసు విచారణను 1999లో సీబీఐకి అప్పగించారు. నిందితులపై సీఆర్‌పీసీ 120బీ, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 2004లో సీబీఐ కోర్టు ఈ కేసులో నిందితులకు రెండేళ్ల శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పుపై సూర్యప్రకాశ్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. ఎమ్మార్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలంటూ సిబిఐ అధికారులు ఆయనను పిలిపించి 2011 సెప్టెంబర్ 15న అరెస్ట్ చేశారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఈయన శిక్షాకాలం పూర్తికాక ముందే ఇతన్ని జైలు నుండి విడుదల చేశారు. అయితే ఇతనిని రెమిషన్ మీద విడుదల చేశామని జైలు అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrbabu problems some students in krishna
Tdp will support trs in co operative elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles