Telangana mps don resign

Telangana MPs, Telangana state, resign,

Cong backs separate state, Telangana MPs don't resign

Telangana MPs don resign.png

Posted: 01/31/2013 01:17 PM IST
Telangana mps don resign

t-congress-mps

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రెండు వర్గాలు చీలాయా ? అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్యన రాజీనామాల విషయంలో విభేదాలు తలెత్తడంతో రెండుగా చీలిపోయారని తెలుస్తుంది. తాజాగా తమ రాజీనామాల పై మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి స్టేట్ మెంటు తరువాత ఎంపీ మధుయాష్కీ కేంద్రం తెలంగాణకు కట్టుబడి ఉందని స్పష్టమైందని, రాజీనామాలు అవసరం లేదని వ్యాఖ్యానించడం పై కొందరు ఎంపీలు దీనిని ఖండిస్తూ,.... ఎమ్.పిలు రాజయ్య,గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లు మాత్రం రాజీనామాల పై వెనక్కి తగ్గేది లేదని, తాము రాజీనామాలు సమర్పిస్తామని చెబుతున్నారు. సోనియాగాంధీ కార్యాలయంలోనే రాజీనామా ఇస్తామని ఆయన చెప్పడం విశేషం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలలో ఛీలికలు ఏర్పడ్డాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో హస్తిన నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఎంపీలు గురువారం ఉదయం పార్టీ సీనియర్ నేత కేశవరావు నివాసంలో సమావేశం అయ్యారు. తాము రాజీనామాలకు కట్టుబడే ఉన్నామని వారు స్పష్టం చేశారు. తమ రాజీనామా లేఖలను సోనియా కార్యాలయంలో ఇచ్చామని,తెలంగాణ ఇవ్వని పక్షంలో రాజీనామాలను ఆమోదించాలని కోరినట్లు ఎంపీ రాజయ్య తెలిపారు. రాజీనామాలు ఇచ్చేవరకూ కాంగ్రెస్లోనే కొనసాగుతామని, రాజీనామాల వెనక కేవీపీ ఉన్నారనటం వాస్తవం కాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President botsa satyanarayana
Maharastra police summons asaduddin owaisi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles