Ugly comments on facebook

ugly comments on face book, facebook, twitter, social networking sites, film news, movie news, delhi rape case, ugly comments on facebook

ugly comments on facebook

25.gif

Posted: 01/27/2013 05:22 PM IST
Ugly comments on facebook

fb

       సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్కారాన్ని మరిచి.. మహిళలను దారుణంగా అవమానించే దౌర్భాగ్యులకు ఈ సైట్లు వేదికగా కూడా మారుతున్నా యి.  ఈ సైట్లలో ఉండే మగవారంతా చదువుకున్నవారే! పురుషాహంకార ధోరణితో మహిళలపై వారు చేసే వ్యాఖ్యలు.. సోషల్ సైట్ల వికృతత్వానికి మరో పార్శ్వంగా నిలుస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో నాలుగైదురోజుల కింద కొందరు వ్యక్తులు ఇలాగే రెచ్చిపోయారు! ఉచ్ఛం, నీచం మరిచి ఆడవారి గురించి కారుకూతలు కూసి అడ్డంగా దొరికిపోయారు. ఏడేళ్ల బాలిక నుంచి.. పీహెచ్‌డీ స్కాలర్ల వరకూ.. ఎవరినీ వదలకుండా ఆడపిల్లలపై అక్షరాలా విషం కక్కారు వీరు. సభ్యసమాజం తలదించుకునే మాటలు వాడుతూ ఘోరమైన కామెంట్లు రాశారు.
      తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం అనే ప్రబుద్ధుడు దీనంతటికీ మూలకారణం అయితే, కృష్ణమోహన్, చావలి పవన్, సూరంపూడి పవన్ సంతోష్‌కుమార్, యోగి పవన్, పరశురాముడు (ఇది ఫేక్ పేరు) ఆయన మాటలకు ప్రతిస్పందిస్తూ నీచంగా వ్యవహరించారు. ఇంకా పదుల సంఖ్యలో ఈ వ్యాఖ్యలకు 'లైక్'పెడుతూ పరోక్షంగా సమర్థించారు. ఇదీ మనవాళ్ల సంస్కారం..
     వివరాల లోతుల్లోకి వెళితే..  తాడేపల్లి ఫేస్‌బుక్ వాల్ పై మామూలుగా మొదలైన వీరి ప్రకోపం క్రమేపీ శ్రుతి మించింది. హద్దులు దాటింది. ఆన్‌లైన్‌లో అతివల ఆగ్రహానికి కారణమైంది. ఈ చదువుకున్న మూర్ఖుల రాతలను స్క్రీన్‌షాట్లు తీసిన కొందరు సోషల్‌సైట్ వినియోగదారులు 'ఎడ్యుకేటెడ్‌రోగ్స్' పేరిట ఫేస్‌బుక్‌లో ఒక పేజీ ఓపెన్ చేసి అందులో ఈ స్క్రీన్‌షాట్లను ఉంచడంతో వీరి బండారం సాక్ష్యాలతో సహా ప్రపంచానికి తెలిసింది. వీరి పైత్యంపై ఆగ్రహం చెందిన పలువురు మహిళలు స్త్రీవాద పత్రిక 'భూమిక' సంపాదకురాలు కొండవీటి సత్యవతి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె వెంటనే స్పందించారు. ఫేస్‌బుక్‌లోని 'ఎడ్యుకేటెడ్‌రోగ్స్' పేజీని సైబర్ నేరాలను దర్యాప్తుచేసే పోలీసు విభాగం దృష్టికి తీసుకెళ్లటంతో కేసు దర్యాప్తు బాటపట్టింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp president chandrababu health
Ou students agitation on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles