Tanikella bharani about telugu language

tanikella bharani, tanikella bharani telugu language, andhra education society, new delhi, tanikella bharani midhunam, tanikella bharani new pics, about telugu language

tanikella bharani about telugu language

15.gif

Posted: 01/14/2013 04:58 PM IST
Tanikella bharani about telugu language

ta

       తెలుగుభాషకు ఆదరణ కరువవటం పట్ల నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు.  చచ్చిపోతున్న భాషల్లో తెలుగు ఒకటని కొన్ని గణాంకాల్లో పేర్కొంటున్నారు. అది బాధాకరం. పొట్టపోసుకోవడానికి ఆంగ్లం తప్పనిసరి. అదేవిధంగా మాతృభాషను, మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందుకు ప్రతి ఇంటి నుంచి కృషి జరగాలి అని ఆయన వాపోయారు.
       ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాషపై మమకారం ప్రవాసాంధ్రుల్లోనే ఎక్కువగా ఉంటోందన్నారు. ఢిల్లీలోనూ తెలుగువారు మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుండటం ఆనందంగా ఉందని... వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే వీరిని చూసి నేర్చుకోవాలన్నారు.
       ఈ సందర్భంగా ఆయన పలు సన్నివేశాలను వివరిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. సంప్రదాయాలు గౌరవిస్తే అనుబంధాలు తెలుస్తాయని...అప్పుడే ఇక్కడి వైద్యవిద్యార్థిని (నిర్భయ)పై జరిగిన సామూహిక అత్యాచారం వంటి అకృత్యాలు తగ్గుతాయన్నారు. ఢిల్లీలో తెలుగు వారి కోసం సేవలందిస్తున్న ఏఈఎస్ నిర్వాహకులను అభినందించి ప్రశంసించారు.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swami ayyappa divotee death
Bhakta prahladam in state wide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles