Minister ram reddy venkat reddy faces bribery allegations

minister ram reddy, minister ram reddy venkat reddy, faces bribery allegations, congress minister, college, paparao, 35 lakhs, notice, school , khammam district

Minister Ram Reddy Venkat Reddy faces bribery allegations

Minister Ram Reddy.gif

Posted: 01/05/2013 04:06 PM IST
Minister ram reddy venkat reddy faces bribery allegations

Minister Ram Reddy Venkat Reddy faces bribery allegations

లంచం తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణల పట్ల మంత్రి రాంరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలనీ, నాపై కుట్ర పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు  తాను ఎవరినీ డబ్బు డిమాండ్ చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. ఇందులో రాజకీయ కుట్ర ఉన్నట్లు, పాపారావు అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.  ఖమ్మం చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన పాపారావు అనే వ్యక్తి తనకు రూ. 35 లక్షలు లంచం ఇచ్చారన్నది అబద్ధం అని స్పష్టం చేశారు. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆరోపించారు. 450 ఎకరాలను తాను కబ్జా చేశానని చెబుతున్నరు, కానీ ఖమ్మం జిల్లా నెమలిపూడిలో 750 ఎకరాలను గిరిజనులకు పంచిన చరిత్ర తమది అని పేర్కొన్నారు. తనపై వచ్చిన అభియోగాలకు బహిరంగ విచారణకు సిద్ధమని తేల్చిచెప్పారు. వ్యక్తిగత కారణాల వల్లే టీ కాంగ్రెస్ ఐక్యత సదస్సుకు హాజరు కాలేకపోయానని తెలిపారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirupathi severe ragging in ttd ayurveda college
Settle rape case with rs 50000 up panchayat tells victim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles