Tdp man to fight kiran for jagan

kiran favors tdp to fight on jagan, nallari kiran kumar, chintala ramachandra reddy, chief minister n. kiran kumar reddy, n. kiran kumar reddy in piler, 2014 election, ys jagan, ysrcp,

TDP man to fight Kiran for Jagan

Jagan.gif

Posted: 01/04/2013 12:02 PM IST
Tdp man to fight kiran for jagan

TDP  man to fight Kiran for Jagan

వైఎస్ జగన్ కన్ను  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి  కిరణ్ కుమార్ రెడ్డి మీద పడింది.  సీఎం ను ఎలాగైన  ఓడించాలనే ధీమాతో జగన్  ఉన్నట్లు  తెలుస్తోంది. అందుకోసం  టీడీపీ మాజీ ఎమ్మెల్యే ను  అందుకు పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పీలేరుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం.. మీకు పార్టీ అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తాం.. అక్కడ సీఎంను ఎలాగైనా ఓడించాలని చంచల్ గూడ జైలులో తనను కలిసిన వాయల్పాడు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి జగన్ లక్ష్యం నిర్దేశం చేశారు. మధ్యాహ్నం జైలులో చింతల జగన్‌తో ములాఖత్ అయ్యారు. సుమారు అరగంటపాటు వారిద్దరూ చర్చలు జరిపారు.  ఈ సందర్భంగా పీలేరు నియోజకవర్గ పరిస్థితు ల గురించి, ఇదివరకటి ఎన్నికల్లో చింతల- నల్లారి కుటుంబీకులు మధ్య జరిగిన పోటీల ఫలితాల గురించి జగన్ చింతలను ఆరా తీసినట్టు తెలిసింది. కిరణ్ కుమార్‌రెడ్డికి తన తండ్రి రాజకీయంగా ఎంతో 'లిఫ్ట్' ఇచ్చారని, అయితే అందుకు ఆయనకు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా పోయిందని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అందువల్ల అతన్ని ఎలాగైనా ఓడించాలని చింతలతో పేర్కొన్నట్టు తెలిసింది. ఈలోపు నియోజకవర్గంలో ప్రజలకు అందు బాటులో వుంటూ ఎన్నికల నాటికి పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలని జగన్ సూచింనట్లు సమాచారం.  టీడీపీ పార్టీ మాత్రం చింతలను  సస్సెండ్ చేసిందని  టీడీపీ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  4 indians charged with murder in singapore
Lagadapati rajagopal comments on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles