ఢిల్లీలో వైద్య విద్యార్థి పై జరిగిన గ్యాంగ్ రేప్ నిరసనగా గత మూడు రోజులు నుండి ఢిల్లీలో నిరసన సెగ రగిలిపోతుంది. ఈ సెగను నివారించటానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినప్పటికి ఫలితం సాధించలేకపోయారు. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆందోళన కారులకు చెక్ పెట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన కారులు ఇండియా గేటు వద్దకు చేరుకోవడాన్ని ఉపయోగించే దారులపై షిండే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారిని నివారించటానికి ఢిల్లీలో ఉన్న 9 మెట్రో రైలు స్టైషన్లను మూసివేశారు. ఇలా చేయటంతో విద్యార్థులు, ఆందోళన కారులు, ఇండియా గేట్ వద్దకు చేరుకోవటం చాలా కష్టమని ప్రభుత్వం భావిస్తుంది.
ఇప్పటివరకు ప్రగతి మైదాన్, రాజీవ్ చౌక్, ఉద్యోగ్ భవన్ , రేస్ కోర్సు లాంటి రద్దీగా ఉండే స్టేషన్లు మూసివేయడంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హొంశాఖ మంత్రి ఇలా చేయటం ఢిల్లీ ప్రజలు మండిపడుతున్నారు. షిండే చర్యలు ‘‘ తలనొప్పిగా ఉంది అంటే మోకాలికి మందు రాస్తే తలనొప్పి తగ్గుతుందా? ’’ అనే విధంగా ఉందని ప్రజలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మహిళల రక్షణ కోసం ఉద్యమం చేస్తూంటే, రక్షణ చర్యలు తీసుకోకుండా, ఢిల్లీలో కొత్త సమస్యలు తలెత్తే విధంగా షిండే ప్రవర్తిస్తున్నారని ఢిల్లీ సామాన్య ప్రజలు వాపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more