Cm kiran kumar reddy meets ministers

cm kiran kumar reddy, chief minister n kiran kumar reddy, congress party, andhra pradesh, congress party ministers, ministers, dharmana prasadrao, governor narasimhan, minister dl ravindra reddy, cbi, botsa, minister sridhar babu, sabhitha indra reddy, balnayak

cm kiran kumar reddy meets ministers

meets  ministers.gif

Posted: 12/22/2012 05:23 PM IST
Cm kiran kumar reddy meets ministers

cm kiran kumar reddy meets  ministers

గవర్నర్‌ ఈ ఫైలును తిప్పిపంపడం సర్కారుకు పిడుగుపాటులా ఉంది. దానిపై కోర్టులో సిబిఐ పిటిషన్‌ దాఖలు చేసిన రోజునే మీడియాలో కథనాలు వచ్చాయిగానీ, నిజానికి అంతకు ముందే ఫైలు చేరింది. గవర్నర్‌ నిర్ణయంపై ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. బొత్స సత్యనారాయణ, సబితాఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబు, విశ్వరూప్‌తో పాటు కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ధర్మాన ప్రాసిక్యూషన్‌ విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఫైలును తిప్పిపంపుతూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల ఒకరిద్దరు మంత్రులు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గవర్నర్‌ లేవనెత్తిన సందేహాల కారణంగా కేబినెట్‌ ముందుకు మరోసారి ఫైలును తీసుకురావద్దని మంత్రులు సిఎంను కోరినట్లు సమాచారం. సిఎంతో భేటీ అనంతరం ఒక మంత్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 'ఈ సమస్యను ప్రతిష్టగా తీసుకోవాలనుకోవడంలేదు. అన్ని విషయాలను పరిశీలించడం మేలు' అని ఆయన అన్నారు. ఈ మల్లగుల్లాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం వేచిచూడాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయమై సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నందున కోర్టు నిర్ణయం వెలువడేంతవరకూ వేచిచూసే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి నుండి ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతున్న మంత్రి డిఎల్‌ రవీంధ్రారెడ్డి 'గవర్నర్‌ ఫైలును తిప్పిపంపడం ప్రభుత్వానికి ఇబ్బందే' అని స్పందించారు. అసలు తానుగా తీసుకోవాల్సిన ప్రాసిక్యూషన్‌ మినహాయింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేబినెట్‌ మొత్తానికి ఆపాదించే ప్రయత్నం చేయడం సరికాదని గతంలో వ్యాఖ్యలు వచ్చాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Observe december 23 as protest day kodandaram
Peaceful protest turns chaotic at india gate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles