Sitar maestro pandit ravi shankar passes away

Sitar maestro Pandit Ravi Shankar,Ravi Shankar,Pandit Ravi Shankar,Grammy awards,Diego,Bharat Ratna

Pandit Ravi Shankar, the most known contemporary Indian musician, passed away in San Diego city of United States on Tuesday.

Sitar maestro Pandit Ravi Shankar passes away.png

Posted: 12/12/2012 10:26 AM IST
Sitar maestro pandit ravi shankar passes away

Ravi_shankar

ప్రముఖ సితార వింధ్వాంసుడు పండిట్ రవి శంకర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రవిశంకర్ మంగళవారం సాన్ డియాగోలో కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆయనను గత గురువారం స్ర్కిప్స్ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. అది తీవ్రం కావడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 సంవత్సరాలు. పండిట్ రవి శంకర్ 1920 ఏప్రిల్ 7తేదిన పండిట్ రవిశంకర్ వారణాసిలో జన్మించారు. సంగీతకారుడిగా, కంపోజర్ గా సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, మన భారతీయ సంగీతానికి  విదేశాలలో మంచి గుర్తింపు తెచ్చి పెట్టారు. అంతే కాకుండా ఈయనకు భారతీయ సంగీత రాయభారి అనే పేరు కూడా ఉంది. ఒక సంగీతంలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఆయన రాణించారు. ఆయన ఆయన 1986 నుంచి 1992 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మూడుసార్లు గ్రామీ అవార్డుల్ని పండిట్ రవిశంకర్ సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్న పండిట్‌ రవిశంకర్‌కు 1999లో భారతరత్న బిరుదును భారత ప్రభుత్వం సత్కరించింది. 92 సంవత్సరాల వయస్సులో కూడా వచ్చే గ్రామీ అవార్డుల కోసం రవిశంకర్ పోటీలో నిలిచారు. ఈ వయస్సులో కూడా గ్రామీ అవార్డుల కోసం పోటీ పడ్డారంటే ఆయన ప్రతిభ ఎంతటిదో వేరే చెప్పనక్కర్లేదు. ఈయన మరణం భారత సంగీత ప్రపంచానికి తీరనిలోటు అని చెప్పవచ్చు. ఈయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఈయనకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special day newborn delivery in visakhapatnam
A very special day of 121212  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles