Panic incidents in nizamabad madhya pradesh etc

panic incidents, panic incidents in nizamabad,panic incident in madhya pradesh, constable kills her wife, constabel kills her daughter, police, police station, madhyapradesh, west godavari, chittoor, murders

panic incidents in nizamabad, madhya pradesh etc

1.gif

Posted: 12/09/2012 11:52 AM IST
Panic incidents in nizamabad madhya pradesh etc

kill

       సభ్యసమాజం తలదించుకునే సంఘటనలు.. దారుణాలు.. ఒకటిని మించిన దుర్ఘటన మరోటి. నూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యను, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుర్ని కత్తి వేటుతో ప్రాణాలు తీసాడో ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన  రక్షకభటుడు. నిజామాబాద్ జిల్లా దుబ్బాకలో ఓ కానిస్టేబుల్ భార్యతోపాటు, ఏడేళ్ల కుమార్తెని గొంతు కోసి హత్య చేశాడు. తాడ్వాయి కానిస్టేబుల్ అయిన వెంకటేష్ ఈ హత్యలు చేసిన అనంతరం నిజామాబాద్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

      ఇదిలా ఉంటే మరో కానిస్టేబుల్ గుంటూరులో రెచ్చిపోయాడు. అతని భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చడానికి ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్ ఐన కిశోర్ బాబు తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పుంటించాడు. భర్త రెండోపెళ్లి చేసుకుని తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భార్య ఆరోపిస్తోంది.


      మరో ఆటవిక ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.  జబల్‌పూర్‌లో ఈ దారుణం జరిగిపోయింది. ఆకతాయిలు కొందరు మతిస్థిమితంలేని ఓ వ్యక్తి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అతనిని కారుకు కట్టి కిలోమీటరు పైగా ఈడ్చుకు వెళ్లారు. ఆ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.
        ఇక విధి వక్రించి.... చిత్తూరు జిల్లా చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయత్రి కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ మృతి చెందారు. బైకు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఉదయం జరిగిన మరో ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayapradha re entry into ap politics
Tdp sujana chowdary explanation to chandra babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles