Tdp sujana chowdary explanation to chandra babu

MP sujana chowdary, tdp, chandra babu, telugu desam party, sujana chowdary, sujana chowdary explanation, sujana chowdary explanation to chandra babu, fdi issue, rajyasabha, fdi voting,

tdp sujana chowdary explanation to chandra babu

19.gif

Posted: 12/09/2012 01:34 PM IST
Tdp sujana chowdary explanation to chandra babu

sujan

        చేతులు పూర్తిగా కాలిపోయాక ఆకులు పట్టుకునేందుకు యత్నిస్తున్నారు తెలుగుదేశం ఎంపీలు. రాజ్యసభలో జరిగిన దానికి వివరణ మీద వివరణలు ఇచ్చేస్తున్నారు.  ఇటీజ్ ఏ కాస్ట్‌ లీ మిస్టేక్. కాకపోతే తెలియకుండా జరిగిన పొరపాటది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సాంకేతిక కారణాలతో తప్పు దొర్లింది. తెలుగు తమ్ముళ్లు నన్ను క్షమించాలి. ఈ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ప్రలోభపెట్టే వ్యాపార లావాదేవీలు నాకు లేవు’ - రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు గైర్హాజరుపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పందన ఇలా ఉంది.
        ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్ శివారులో టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబును  చౌదరి కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.  ప్రత్యేక వాహనంలో సేద తీరుతున్న బాబుతో సాయంత్రం 5.13 గంటల నుంచి 27 నిమిషాల పాటు వాహనంలోనే మాట్లాడారు.
     అనంతరం మీడియాతో ముచ్చటించారు.  టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పాటుపడుతున్న వారిలో నేనూ ఒకడిని. ఎఫ్‌డీఐలపై సాయంత్రం 4.30కు ఓటింగ్ ఉంటుందని భావించాను. కానీ 3.30కే జరిగింది. విషయం తెలిసి వెళ్లేసరికి, నేను లాబీల్లోకి వెళ్లకుండా లాక్ చేశారు. సాంకేతికపరమైన ఇబ్బంది జరిగింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నా. తెలుగు తమ్ముళ్లకు క్షమాపణ చెప్తున్నా. దీనిపై చంద్రబాబుకు లిఖితపూర్వకంగా సీల్డ్ కవర్‌లో నా వివరణ ఇచ్చాను. టీడీపీ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలన్నింట్లో పాల్గొంటా.. అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడతా. అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా చేస్తా’ అంటూ చౌదరి వివరణ ఇచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incidents in nizamabad madhya pradesh etc
Prime ministe manmohan on fdi system  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles