Sc upholds the 200 maximum cap on outgoing sms in india

Supreme Court, daily cap of 200 SMS, Personal Mobile Phones, TDSAT order

Supreme Court has upheld the decision of TRAI to put a daily cap of 200 SMS to be sent from Personal Mobile Phones. It stayed the operation of a TDSAT order

Supreme Court upholds the 200 Maximum sms.png

Posted: 12/04/2012 10:16 AM IST
Sc upholds the 200 maximum cap on outgoing sms in india

200_Maximum_smsమీరు అమ్మాయిలతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ చాటింగ్ చేస్తున్నారా ? రోజు ఎస్సెమ్మెస్ లు చేస్తూ.... ఫోన్ బిల్లును సేవ్ చేసుకుందామని అనుకుంటే ఇక పై మీ ఆటలు సాగవు. ఇక పై మీ సెల్ ఫోన్ నుండి రోజుకు రెండు వందల ఎస్సెమ్మెస్ లు మాత్రమే పంచించగలరు. ఈ లెక్క దాటితే మీ నెంబర్ నుండి మెసేజ్ లు వెళ్లవు. ఎస్ఎంఎస్‌లపై ట్రాయ్ అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని  మెసేజ్‌లపై నియంత్రణ భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమంటూ ఆదిత్య ఠాక్రే టెలికాం ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు.  దానిని విచారించిన ట్రిబ్యునల్... అది పౌరుల హక్కుకు భంగం కలిగిస్తోందని అభిప్రాయపడింది.

200ఎస్ఎంఎస్‌లు మాత్రమే పంపించాలన్న టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్)నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రాయ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ గత జులైలో టెలికాం ట్రిబ్యునల్(టీడీఎస్ఏటీ) ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. జస్టిస్ జీఎస్ సంఘ్వి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  దీన్ని సవాల్ చేస్తూ ట్రాయ్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ట్రాయ్ పిటిషన్‌పై ఆరు వారాల్లో స్పందించాలని ఆదిత్య ఠాక్రేకు నోటీసులిస్తూ అప్పటివరకు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. స్టే తొలగించే వరకు ఎస్ఎంఎస్‌లపై నిబంధన ను ట్రాయ్ అమలు చేయవచ్చని స్పష్టంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc botsa worried about liqour price
Chandrababu reaches 1000 km in his pada yatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles