Keshava rao flays azad for telangana remarks

Keshava Rao, Azad,Telangana, remarks, congress Party,

Keshava Rao flays Azad for Telangana remarks

Keshava.gif

Posted: 10/15/2012 12:53 PM IST
Keshava rao flays azad for telangana remarks

Keshava Rao flays Azad for Telangana remarks

 తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తేలిక కాదంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు మండిపడ్డారు. చేతగాకపోతే తెలంగాణ ఇవ్వలేమని చెప్పాలి తప్ప ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తమను దూరం చేసేందుకే ఆజాద్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారేమోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డితో కలసి కేకే తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆజాద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తామంతా వేరే పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆజాద్ అట్లా మాట్లాడుతున్నారేమోనని ఆయన సందేహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తల్చుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేయడం తేలికన్నారు. ‘తెలంగాణపై తీర్మానం చేయకపోతే అసెంబ్లీకి రాబోమని 20 మంది ఎమ్మెల్యేలు చెప్పండి చాలు.. ప్రభుత్వం వెంటనే మీతో చర్చలు జరిపి తీర్మానం పెడుతుంది. అంతేతప్ప ఇతరులపై నెపంవేసి ప్రజల్ని మోసగించడం భావ్యం కాదు’ అని కేకే అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pregnant woman dies after gang rape
Notices issued to trs leader ktr by ap high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles