Kakarapalli thermal power plant

Kakarapalli,Thermal Power Plant,

Kakarapalli Thermal Power Plant

Kakarapalli.gif

Posted: 10/10/2012 12:28 PM IST
Kakarapalli thermal power plant

Kakarapalli Thermal Power Plant

పల్లి థర్మల్‌ పవర్‌ప్లాంట్ పరిసరాల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ పవర్ ప్లాంట్‌ నిర్మాణం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండడంతో సంతబొమ్మాళి మండలం పరిధిలోని గ్రామస్థులు మళ్లీ ఉద్యమబాట పట్టారు.గ్రామస్థులందరూ వీధుల్లోకి వచ్చి గత ఆరు రోజులుగా రోడ్డుపైనే వంటావార్పు, నిద్ర చేస్తూ ధర్నా చేపట్టారు. యాజమాన్య వైఖరి స్పష్టంగా వెలువడే వరకూ ధర్నా విరమించేది లేదని పట్టుపట్టడంతో బుధవారం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.సోంపేట మండలం బీలప్రాంతంలో ఎన్‌సిసి పవర్‌ ప్రాజక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా 2010 జూలై 14వ తేదీన స్థానిక ప్రజలు నిర్మాణ పనులు అడ్డుకున్న నేపథ్యంలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించగా, సుమారు వందమందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.2011 ఫిబ్రవరి 28న వడ్డితాండ్ర, హనుమంతునాయుడుపేట వద్ద జరిగిన పోలీసు కాల్పుల తర్వాత ప్లాంట్‌ నిర్మాణ పనులు నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణ అనుమతులు లేవని, అప్పట్లో ప్రకటన విడుదల చేసింది. అయితే, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు వెనకడుగు వేయడంతో ... ఇక్కడ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా పునర్‌ ప్రారంభమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dtc bus breaks fail in delhi
Theft at mahankali temple at old city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles