Tdp president chandrababu job for all

tdp president chandrababu job for all , vastunna meekosam padayatra

tdp president chandrababu job for all

3.png

Posted: 10/08/2012 02:12 PM IST
Tdp president chandrababu job for all

babu_inn

పేదల సొమ్మును కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు పంది కొక్కుల్లా తిన్నారని, తిన్నవాళ్లందరూ జైళ్లల్లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. దేశంలో అవినీతికి హద్దు లేకుండా పోయిందని, ఢిల్లీ నుండి గల్లీ వరకు అంతా అవినీతిమయమై పోయిందన్నారు. గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్ని అంటాయని, ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి అప్పుల ఊబిలో నెట్టేశారన్నారు.
       కాంగ్రెస్‌ వాళ్లు ఒకే ఇంటిపేరు మీద 10 బిల్లులను డ్రా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారని, వృద్దాప్య ఫించన్‌ కింద ఇచ్చే రు.200 దేనికీ చాలవని పేర్కొన్నారు. రైతులు ఎరువులు కొనలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే తమ కుర్చీలను కాపాడుకోవడం కోసం నాయకులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన అన్నారు. ఐదేళ్ళుగా కరువుకోరల్లో కూరుకుపోయిన రైతన్నను ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వేరుశెనగ కోసం చేసిన అప్పులు తీరక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీసం వారివైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. పశువులకు గ్రాసం లేక చాలా మంది రైతన్నలు కబేళాలకు తరలించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ పాదయాత్ర పేదలయాత్రగా చంద్రబాబు పేర్కొన్నారు.
       టిడిపి హయాంలో గ్యాస్‌ను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. డీజిల్‌ ధరలు అంతకంతకు పెంచడం దారుణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 200 పెన్షన్‌ను 500కు పెంచుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో బిసిలకు 100 సీట్లు కేటాయిస్తామన్నారు.
        అనంతరం అచ్చంపల్లి గ్రామంలో ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రామప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు ఈ అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. తల్లికాంగ్రెస్‌, పిల్లకాంగ్రెస్‌ దొందూదొందేనని, రెండు పార్టీల్లోనూ రాబందులు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌, పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, రాష్ట్ర కార్యదర్శి సత్యవాణి, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఉన్నం హనుమంతురాయ చౌదరి, జిల్లా నాయకులు వరదాపురం సూరి, ప్రభాకర్‌ చౌదరి, మండల నాయకులు జయ రాములు, దండా వెంకటేశులు, లక్ష్ష్మీనారాయణ, సురేంద్ర, బొమ్మయ్య, మాజీ జెడ్పీటీసీ రామ్మోహన్‌ చౌదరి, తిప్పేస్వామి, మాజీ ఎంపిపి నరసింహులు, పెద్దఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
         కళ్యాణదుర్గంలో నేడు బాబు యాత్ర ఇవాళ బాబు పాద యాత్ర చేస్తున్నారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతోంది. మంద, కుర్లపల్లి క్రాస్‌ నుండి పాదయాత్ర ప్రారంభమై కదిరిదేవరపల్లి, ములకనూరు చేరుతుంది. ములకనూరు మిట్టపై మధ్యాహ్న భోజన విరామానంతరం పాదయాత్ర బృందం దాసంపల్లి మీదుగా బోయలపల్లికి చేరుకుంటుంది. కాగా, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మొదలుపెట్టిన పాదయాత్ర అనంతపురం జిల్లాలోనే ఆరు రోజులు పూర్తి అయింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama raises record funds
Former pcc chief d srinivas telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles