Ap state bjp leaders venkaih naidu

ap state bjp leaders venkaih naidu, kishan reddy, congress hathavo desko bachavo

ap state bjp leaders venkaih naidu

3.png

Posted: 10/07/2012 12:41 PM IST
Ap state bjp leaders venkaih naidu

venkaiah

యూపీ ఏ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ..‘కాంక్షిగెస్ హఠావో.. దేశ్‌కో బచావో’ నినాదం తో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి నవంబర్ 11 వరకు ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపింది. సిలిండర్ల కుదింపును నిరసిస్తూ.. 12న మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని ప్రకటించింది. బీజేపీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.
        2002లో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సహా కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. యూపీఏ మీద వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎఫ్‌డీఐకి అనుమతిచ్చిందని ఆయన ఆరోపించారు. యూపీఏ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి నవంబర్ 11 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. సిలిండర్ల కుదింపును నిరసిస్తూ.. 12న మహిళా మోర్చ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఇటువంటి ప్రకటనలను ఎనిమిదేళ్లు గా వింటునే ఉన్నామని ఆయన చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి, అధికార ప్రతినిధి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఉన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajith sing new party in andhrapradesh
Telanga congress leaders fight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles