Ajith sing new party in andhrapradesh

ajith sing new party in andhrapradesh, rashtreeya lok dal party

ajith sing new party in andhrapradesh

9.png

Posted: 10/07/2012 12:45 PM IST
Ajith sing new party in andhrapradesh

ajit-singhe

ఆంధ్ర ప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ కోణం సాక్షాత్కారం కాబోతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరో కొత్త పార్టీ ఆవిర్భవిస్తోంది. కేంద్ర మంత్రి అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ర్టీయ లోక్ దళ్ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ర్టీయ లోక్ దళ్ పార్టీగా ఆవిర్భవించనున్నది. దీని కోసం కేంద్ర మంత్రి అజిత్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన ఆయనను నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఇంట్లో తెలంగాణ ఎంపీలతో పాటు, టీజేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్ గౌడ్, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. రాయల తెలంగాణకు మద్దతు ఇస్తున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమం, రాష్ర్టానికి సంబంధించిన తాజా రాజకీయాలపై అజిత్ తో టీ ఎంపీలు చర్చించినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న తాత్సారం వల్ల పార్టీకి రాష్ర్టంలో జరిగే నష్టం విషయమై కూడా టీ ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎంతో ఆలస్యం చేసిందనీ, ఇంకా నాన్చుడి ధోరణి అవలంభిస్తే కాంగ్రెస్ నష్టపోతుందనీ ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీ కాంగ్ ఎంపీలు అజిత్ కు వివరించినట్లు సమాచారం. అజిత్ ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న అజిత్ తన పార్టీని ఇప్పుడు మన రాష్ర్టానికి కూడా విస్తరించే పనిలో భాగంగా తెలంగాణ రాష్ర్టీయ లోక్ దళ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నాడు. దీనికి ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ నాయకత్వం వహించే అవకాశం వుంది. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఏర్పాటును టీ ఎంపీలు, కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడే వారితో తాము కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేకే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gas cylender price hike
Ap state bjp leaders venkaih naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles