సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, యోగా గురువు బాబా రామ్‌దేవ్‑లు చెప్పే మాటలు వింటుంటే వారు పగటి కలలు కంటున్నారనిపిస్తోంది. పార్లమెంటులో ముఖాలను మార్చడం కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను రాజకీయ పార్టీ పెడితే పార్లమెంటుకు 400 మంది ఎంపీలను పంపుతానని రామ్‑దేవ్ చెప్పారు. ఇవన్నీ ఆచరణలో సాధ్యమేనా? ఈ దేశంలో రాజకీయ, సామాజిక పరిస్థితులు వారికి తెలియదనుకోవాలా? అధికారాన్ని చేజిక్కించుకోవడం అంత తేలికనుకుంటున్నారా? ఈ వ్యవస్థని మార్చడం అంత సులువా? ప్రజలకు ఏం చెబుతున్నారో, వారికి ఎటువంటి ఆశలు కల్పిస్తున్నారో వారికి అర్థమవుతుందా? అసలు ప్రజలు వారి మాటలను నమ్ముతున్నారా? అన్న అనుమానం కూడా రాకమానదు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జన్‑లోక్‑పాల్ ఉద్యమంలో భాగంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ అలుపెరుగని పోరాటం చేశారు. ఉద్యమం ఉదృతంగా సాగింది. దేశం నలుమూలల నుంచి మంచి స్పందన కనిపించింది. పలు రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు మద్దతు పలికారు. ఉద్యమ తీవ్రతను చూసి దేశంలో అవినీతి అంతమయ్యే కాలం దగ్గరపడిందని ప్రజలు భ్రమపడ్డారు. వారి ఆశలు ఎంతో కాలం నిలవలేదు.రాజకీయ విప్లవంతోనే జన్‑లోక్‑పాల్ సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఆయనకు మరికొందరు తోడయ్యారు.
ప్రారంభంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అన్నా హజారే ఆసక్తి చూపినా, ఆ తరువాత ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఆయన అనుచరులు కేజ్రీవాల్‑, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా వంటివారు విడిపోయి రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీ అనగానే ఉద్యమంలో ఊపుతగ్గింది.పార్టీ పెట్టినా తన పేరుగాని, ఫొటో గాని వాడుకోవడానికి కేజ్రీవాల్ మద్దతుదారులకు అన్నా హజారే అనుమతి ఇవ్వలేదు. వీరిద్దరూ విడిపోవడం వల్ల ఉద్యమం బాగా బలహీనపడింది. ఇప్పుడు జన్‑లోక్‑పాల్ మద్దతుదారులకు ఎటువెళ్లాలో అర్ధంకాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇటు రాజకీయాలలోకి దిగాలా? అటు అన్నా హజారే వెంట ఉండాలా? అన్న ఆలోచనలో పడ్డారు.వీరిద్దరూ సామాన్యమైన వ్యక్తులు ఏమీకాదు. వేరు రంగాలలో అనుభజ్ఞులే. రాజకీయాలు, సమాజం పట్ల అవగాహన ఉన్నవారే. నీతిమంతులను, నిజాయితీ పరులను ఈ ప్రజలు ఎన్నుకుంటారా? ఈ వ్యవస్థలో వారు గెలవగలరా?ప్రజలు సంపూర్ణ మద్దతు పలికినా అతికొద్ది కాలంలోనే జన్‑లోక్‑పాల్ ఉద్యమంలో చీలిక వచ్చింది. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినవారు విడిపోయారు. ఈ నేపధ్యంలో అవే ఆశయాలతో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ దీర్ఘకాలం మనగలుగుతుందా అన్న సందేహం రాకమానదు. మనగలిగినా అధికారం చేజిక్కించుకోగలుగుతుందా?రాజకీయంగా పండిపోయిన దిగ్గజాలు ఈ ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఒక కూటమి కూలిపోతే మరో కూటమి అధికారంలోకి వస్తుంది. రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయలు చందాలు ఇచ్చే పెట్టుబడిదారులకు ఈ దేశంలో కొదవలేదు. నోటుకు ఓటు అమ్ముకునే ఓటర్లుకూ కొదవలేదు. మనదేశంలో ఎన్నికలంటే అంగ బలం, అర్థ బలంతోపాటు కులం, మతం బలం కూడా ఉండాలి. ఎన్నికలంటే ఎన్నో రకాల సమీకరణలు పని చేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more