Nara lokesh in chandrababus padayatra

Nara Lokesh in Chandrababu's padayatra,Nara Lokesh, Lokesh babu, Chandrababu padayatra, Vasyunna Meekosam padayatra, Journalist Diary, TDP padayatra.

Nara Lokesh in Chandrababu's padayatra

Nara Lokesh.gif

Posted: 10/04/2012 12:38 PM IST
Nara lokesh in chandrababus padayatra

Nara Lokesh in Chandrababu's padayatra

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో ఆయన కుమారుడు నారా లోకేష్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రెండోరోజు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి లోకేష్ చంద్రబాబు వెంటే నడిచారు. చంద్రబాబు బస చేసిన బస్సులో జిల్లా నేతలతో ఉదయం మంతనాలు సాగించగా ఆ సమయంలో లోకేష్ కూడా ఉండి తగు సూచనలు అందచేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జిల్లా ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అబ్దుల్‌ఘనీతో కూడా మాట్లాడారు. పాదయాత్రలో మధ్యమధ్యలో తండ్రిని అనుసరిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు నడిచారు. ఇదే సమయంలో కార్యకర్తలు చెంతకు రాగా వారితో కరచాలం చేస్తూ వివిధ అంశాలపై వాకబు చేశారు. మార్గమధ్యంలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్న నేతలకు పలు సూచనలు చేస్తూ కనిపించారు. పలుచోట్ల ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు చంద్రబాబు వద్దకు రాగా లోకేష్ సైతం ఆసక్తిగా వినడం కనిపించింది. కార్యకర్తలు లోకేష్‌కు జై అంటూ నినాదాలు చేయగా చిరునవ్వుతో నిరాకరించారు. క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏమిటని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లోకేష్ దాట వేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The brand arvind kejriwal dilemma
Bhut jolokia the hottest chilli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles