Sick boy uses interactive robot to attend school

Sick boy uses interactive robot to attend school,Boy stays home, sends robot to school,

Sick boy uses interactive robot to attend school

robot.gif

Posted: 10/02/2012 11:45 AM IST
Sick boy uses interactive robot to attend school

Sick boy uses interactive robot to attend school

ఇప్పటి వరకు  రోబో చేసే పనులను  వెండి తెరపైనే చూశాం. కానీ నిజ జీవితంలో  మనం చూడలేదు. కానీ ఒక రోబో స్కూల్ వెళ్తుతుంది.  టీచర్ చెప్పే పాఠాలు వింటోంది. అంటే ఒక విద్యార్థి తరుపున  క్లాస్ లకు హాజరవుతోంది.  ఇదేదో దర్శకుడు శంకర్ తీసిన రోబో సినిమా మాదిరిగా ఉన్నట్లు ఉందా? కానీ శంకర్ తీసిన రోబో సినిమా కానేకాదు. ఇది రియల్ జీవితంలో జరుగుతున్న సంఘటన .ఈ యంత్రుడి పేరు ‘రోబోస్వాట్’. ఈ రోబో అయితే ఏకంగా ఓ విద్యార్థి తరఫున క్లాస్‌లకు హాజరవుతోంది. టీచర్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. క్లాస్ అవగానే.. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెబుతోంది. ఇది నిజం.. అమెరికాలోని బఫాలోలో ఉండే డెవాన్ కారో(7) తీవ్రమైన అలర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. దుంపలు, మొక్కజొన్న, ఆపిల్స్ మాత్రమే తింటాడు. డెవాన్ మిగతా విద్యార్థులతో కలిసి.. తిరగడం వల్ల అతడి ప్రాణాలకే ప్రమాదం. దాంతో స్కూల్‌కు వెళ్లే పరిస్థితి లేదు. అప్పుడే ఈ యంత్రుడు అపద్బాంధవుడి అవతారమెత్తాడు.

Sick boy uses interactive robot to attend school

ఇంట్లోని కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే.. ఈ రోబోస్వాట్ స్క్రీన్‌పై వెబ్‌కామ్ ద్వారా డెవాన్ ముఖం కనిపిస్తుంది. క్లాసుల సమయంలో ఇంట్లోని కంప్యూటర్ ముందు డెవాన్ కూర్చుంటాడు. అతడికి రోబో ద్వారా క్లాసు రూంలో అంతా కనిపిస్తుంటుంది. దీని ద్వారానే అతడు టీచర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం.. సహచర విద్యార్థులతో మాట్లాడటం వంటివన్నీ చేస్తుంటాడు. ‘డెవాన్ మిగతా విద్యార్థుల్లాగే హోంవర్క్‌తో సహా అన్నీ చేస్తాడు. ఒక్కటే తేడా.. అతడు క్లాస్ రూంలో మాత్రం ఉండడు’ అని డెవాన్ తల్లి రెనె చెప్పారు. ఈ రోబో మీకు కావాలంటే రూ.2.5 లక్షలు చెల్లించాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan cuts fuel prices
Health minister dl ravindra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles