Manmohan sonia rahul

Congress president Sonia Gandhi, Manmohan, Sonia, Rahul,Cabinet

PM, Sonia Gandhi will decide on Cabinet reshuffle

Sonia.gif

Posted: 09/22/2012 12:05 PM IST
Manmohan sonia rahul

Manmohan-Sonia-Rahul

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ కేంద్ర క్యాబినెట్‌లో చేరే అవకా శాలు మరింత మెరుగుపడ్డాయి. కేంద్ర మంత్రి వర్గంలోకి రాహుల్‌ను ఆహ్వానిస్తున్నామని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ప్రభుత్వంలోకి రాహుల్‌ని ఆహ్వానించేందుకు తాను ఎల్లవేళలా సిద్ధంగా వున్నానని ఆయన స్పష్టం చేశారు. ఉప రాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతిభవన్‌లో ప్రధాని ఈ వ్యాఖ్య లు చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ శని వారంనాడు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వంలోకి రాహుల్‌ రావటాన్ని స్వాగతిస్తానని నేను ఎప్పుడూ చెపుతూనే వున్నాను'' అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.ఎస్‌.యు.ఐ., యువజన కాంగ్రెస్‌ వ్యవహారా లకు ఇన్‌ఛార్జిగా వున్న రాహుల్‌ త్వరలో రాజకీయా లలో క్రియాశీల పాత్ర పోషిస్తారన్న ఊహాగానాలకు ప్రధానమంత్రి నేటి వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. సంస్థ ఇన్‌ఛార్జిగా ప్రధానకార్యదర్శి హోదాలో పార్టీలో ఆయన పెద్ద పాత్రవహించవచ్చునని, అదే సమయంలో క్యాబినెట్‌ మంత్రి హోదాలో ప్రభుత్వం లో ప్రధాన పాత్ర పోషించవచ్చునని, ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా పేర్కొనవచ్చునని కాంగ్రెస్‌ పార్టీలోని ఒక వర్గం పేర్కొంటోంది.

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ త్వరలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌ గాంధీ జులై 19వ తేదీన ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం రాహుల్‌ విలేఖ రులతో మాట్లాడుతూ, కీలక బాధ్యతలు చేపట్టేం దుకు తాను సిద్ధంగా వున్నట్లు చెప్పారు. అయితే, ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించాలన్నది ప్రధా నమంత్రి, పార్టీ అధ్యక్షురాలు నిర్ణయిస్తారని తెలి పారు. ప్రభుత్వం, పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తా నని రాహుల్‌ స్వయంగా చెప్పటం అదే మొదటి సారి. కాంగ్రెస్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నాయకులు ఏకకాలంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భాలు వున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్య దర్శులు ఇరువురు గులాం నబీ ఆజాద్‌, ముకుల్‌ వాస్నిక్‌ క్యాబినెట్‌ మంత్రులుగా కూడా పనిచేస్తు న్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్ష లేదా కార్యనిర్వా హక అధ్యక్ష పదవి రాహుల్‌కు కట్టబెట్టే సాధ్యా సాధ్యాలపై పార్టీలో చర్చలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కొంత మంది ఈ ప్రతిపాదన పట్ల అభ్యంతరం తెలుపుతున్నారు. కేవలం పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయలేక పోయిన ప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని, సోనియా గాంధీ విషయంలో ఆ పరిస్థితి లేదని పేర్కొంటు న్నారు. సెప్టెంబరులో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత ప్రభుత్వంలో భారీగా మార్పులు, చేర్పులు వుండవచ్చునని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

వచ్చే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీ కరణ అవకాశాలు వున్నాయా? అని అడిగిన ప్రశ్నకు మన్మోహన్‌ సమాధానం యిస్తూ, ''అది జరిగేట ప్పుడు మీకు చెపుతాం'' అని అన్నారు. ఉప రాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ రెండవసారి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేం దుకు రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ వంశానికి చెందిన రాహుల్‌కు క్యాబినెట్‌లో చోటుకల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ అతిరధులు, నాయకులు దీర్ఘకా లంగా కోరుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మంత్రి పదవికి రాజీనామా చేయటంతో జూన్‌లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు బలంగా వినిపించాయి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.ఎం. కృష్ణ రాహుల్‌ ప్రభుత్వంలో చేరాలని బలంగా వాదన వినిపించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహాయపడేందుకు ఇది అవసరమని కృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వంలో చేరాలని రాహుల్‌ని ప్రధాన మంత్రి ఇప్పటికే ఆహ్వానించిన విషయాన్ని కృష్ణ ప్రస్తావించారు. ''రాహుల్‌ గాంధీ ప్రభుత్వంలో భాగస్వామి కావాలని మేమంతా ఎప్పుడూ కోరుతూనే వున్నాం. ప్రభుత్వంలో చేరాలని ప్రధాన మంత్రి కూడా ఆహ్వానించారు'' అని అన్నారు.

కాగా, దేశ ఆర్థిక పునాదులు పటిష్టంగా వున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. స్థూలజాతీ యోత్పత్తిలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు. భారత వృద్ధి రేటుకు సంబంధించి మూడి అంచనా అందోళన కలిగిస్తోందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Clerics daughter paraded naked
Tamota price decline sharply  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles